Home Lifestyle Do you know February | ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఎందుకు ఉంటాయి? రోమన్ చక్రవర్తి ఇగోతో క్యాలెండర్...

February | ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఎందుకు ఉంటాయి? రోమన్ చక్రవర్తి ఇగోతో క్యాలెండర్ మొత్తాన్ని మార్చేశాడా?

Image by pvproductions on Freepik

February | సాధారణంగా నెల అంటే 30 రోజులు. కొన్ని సందర్భాల్లో మాత్రం 31 రోజులు వస్తాయి. ఏడాదిలో 12 నెలలు ఉంటే 11 నెలలు ఇలాగే ఉంటాయి. కానీ ఒక్క ఫిబ్రవరి నెలలో మాత్రం 28 రోజులే ఉంటాయి. లీప్ సంవత్సరం వస్తే ఇంకా ఒక్క రోజు ఎక్కువ ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? మిగతా నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో ఎందుకు తక్కువ రోజులు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా?

అసలు లీప్ సంవత్సరం అంటే ఏంటి?

ప్రస్తుతం ప్రపంచమంతటా గ్రేగెరియన్ క్యాలెండర్ వాడుకలో ఉంది. దీని ప్రకారం ఒక్క ఏడాదిలో 365 రోజులు ఉంటాయి. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే లీప్ సంవత్సరంలో మాత్రం 366 రోజులు ఉంటాయి. ఇలా ఉండటం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. సూర్యుడు చుట్టూ భూమి తిరగడానికి దాదాపు 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కరోజులు పావు వంతు. ఈ పావు భాగం కోసం ఒక్క రోజు పెట్టలేరు కాబట్టి.. నాలుగు ఏళ్లకు ఒకసారి ఒక రోజును చేర్చారు. అలా అదనంగా ఒక రోజును చేర్చిన సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అని పిలుస్తారు. ఇలా ఉండటం వల్ల ప్రతి ఏడాది సీజన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అంటే ఈ ఏడాదిలోని ఒక నెలలో ఏ సీజన్ ఉంటుందో.. పదేళ్ల తర్వాత ఆ నెలలో మళ్లీ అదే సీజన్ వస్తుంది.

రోమన్ క్యాలెండర్‌లో 354 రోజులే

క్యాలెండర్లలో అన్నింటికంటే ముందు రోమన్ క్యాలెండర్ ప్రాచుర్యం పొందింది. ఈ క్యాలెండర్‌లో 10 నెలలు మాత్రమే ఉండేవి. ఒక్కో నెలలో 29 లేదా 31 రోజులు ఉండేవి. అంటే అప్పట్లో మార్చి నుంచి డిసెంబర్ వరకు మాత్రమే నెలలు ఉండేవి. జనవరి, ఫిబ్రవరి నెలలు ఉండేవి కాదు. కానీ సూర్యుడి చుట్టూ భూమి తిరిగేందుకు 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈ రోజులు అన్నింటినీ ఒకే ఏడాదిలో కవర్ చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఒక ఏడాది ఏప్రిల్‌లో వేసవి కాలం వస్తే.. రెండు మూడేళ్ల తర్వాత డిసెంబర్‌లోనే వేసవి కాలం వచ్చేసేది. దీంతో సీజన్లు అంచనా వేయడం చాలా కష్టమైపోయేది. దీంతో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చేయాలని రోమన్ రాజు నుమా పాంపిలియన్ భావించాడు. దీంతో రోమన్ క్యాలెండర్‌కు జనవరి, ఫిబ్రవరి నెలలు జోడించి కొత్త క్యాలెండర్‌ను రూపొందించాడు.

జూలియస్ క్యాలెండర్‌‌తో ఖచ్చితత్వం

సుమా పాంపిలియన్ రూపొందించిన లూనార్ క్యాలెండర్‌లో 354 రోజులు మాత్రమే ఉండేవి. రోమన్లు సరిసంఖ్యలను చెడు దినాలుగా చూసేవాళ్లు. అందుకే నెలలో దాదాపు బేసి సంఖ్యలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో నెలకు దాదాపుగా 29 లేదా 31 రోజులు ఉండేలా ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. అంటే జనవరిలో 30, ఫిబ్రవరిలో 29, మార్చిలో 30, ఏప్రిల్‌లో 29, మేలో 30, జూన్‌లో 29, జులైలో 30, ఆగస్టులో 29, సెప్టెంబర్‌లో 30, అక్టోబర్‌లో 29, నవంబర్‌లో 30, డిసెంబర్‌లో 29 రోజులు ఉండేవి. ఇలా ఏడాది మొత్తంలో 354 రోజులు మాత్రమే వచ్చేవి. దీంతో 365 రోజులను కవర్ చేసే విధంగా జూలియస్ సీజర్ కచ్చితత్వం ఉండేలా సరికొత్త క్యాలెండర్‌ను రూపొందించాడు. దీనికోసం ఏడాదికి 11 రోజులను కలిపాడు. జూలియస్ సీజర్ ఫిబ్రవరి నెలను వదిలేసి ఒక్కో నెలకు ఒక్కో రోజును కలిపేశాడు. లీప్ సంవత్సరం సమయంలో మిగిలిన ఒక్క రోజు ఫిబ్రవరితో కలిస్తే లెక్క సరిపోతుందని అనుకున్నాడు. కచ్చితత్వం ఉండటంతో జూలియస్ క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చింది.

రోమన్ చక్రవర్తి ఇగోతో ఫిబ్రవరి నెలకు అన్యాయం

జూలియస్ సీజర్‌ తర్వాత రోమన్ సామ్రాజ్యాన్ని అధిష్టించిన ఆగస్టస్ తన ఇగోతో జూలియస్ క్యాలెండర్‌లో పలు మార్పులు చేశాడు. ముఖ్యంగా జూలియస్ పేరుతో ఉన్న జూలై నెలలో 31 రోజులు ఉండి.. తన పేరు మీద ఉన్న ఆగస్టు నెలలో 30 రోజులే ఉండటం అతనికి నచ్చలేదు. దీంతో ఆగస్టు నెలకు ఒక్క రోజును అదనంగా జోడించుకున్నాడు. అలాగే ఆగస్టు తర్వాత ఉన్న నెలల్లో రోజుల క్రమాన్ని మార్చేశాడు. అయితే ఆగస్టు నెలలో జోడించిన ఒక్కరోజును సర్దుబాటు చేసేందుకు ఫిబ్రవరి నెలలోని ఒక రోజును తీసేశాడు. దీంతో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే మిగిలిపోయాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version