Home Lifestyle Devotional Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Image Source : Pixabay

Shankam | హిందూ సంప్రదాయం ప్రకారం శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏవైనా ముఖ్యమైన పనులు, శుభకార్యాలు మొదలుపెట్టే ముందు శంఖాన్ని పూరించడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో భాగంగా శంఖం ( Conch ) పూరించి భగవంతుణ్ని పిలుస్తుంటారు. మరి ఇలాంటి శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా? ఇంట్లో ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని చాలామంది సంకోచిస్తుంటారు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అమృతం కోసం దేవదానవులు కలిసి చేసిన సముద్రమథనం సమయంలో ఉద్భవించిన 14 రత్నాల్లో శంఖం ఒకటని చెబుతుంటారు. దీన్ని ఇంట్లో పెట్టుకుని పూజించడం, పూరించడం ద్వారా మీలోనూ, ఇంట్లోనూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శంఖం ఊదినప్పుడు వచ్చే ఓంకార శబ్దం సానుకూల ప్రభావంతో ఆ పరిసరాల్లో ఉన్న ప్రతికూల శక్తి అంతం అవుతుంది. శంఖం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏవైనా వస్తు దోషాలు ఉన్న తొలగిపోతాయి. తరచూ గొడవలు జరిగే ఇంట్లో శంఖం ఉంచడం ద్వారా శాంతి నెలకొంటుంది.

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుల్లో శంఖం ఒకటి. అందుకే ఎప్పుడు విష్ణుమూర్తి చేతిలో శంఖం కనిపిస్తుంది. పైగా లక్ష్మీదేవికి శంఖం తోబుట్టువు అని చెబుతుంటారు. అందుకే శంఖం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతుంటారు. సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శంఖం ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి జరుగుతుంది. రోజూ శంఖం ఊదడం వల్ల శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కోలుకుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version