Home Lifestyle Devotional Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Image by azerbaijan_stockers on Freepik

Devotional | హిందూ సంప్రదాయం ప్రకారం కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆలయాలకు వెళ్లినా.. ఏ శుభకార్యం చేసినా కొబ్బరి కాయ కచ్చితంగా కొట్టాల్సిందే. అయితే చాలావరకు ఎక్కడికి వెళ్లినా పురుషులే టెంకాయ కొడతారు. తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆడవాళ్లకు అనుమతిస్తారు. చాలా సందర్భాల్లో వారిని కొబ్బరి కాయ కొట్టకుండా అడ్డుకుంటారు. అలా ఎందుకు అడ్డుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరి కాయను చంద్రుని చిహ్నంగా భావిస్తారు. దాన్ని దేవుడికి సమర్పించడం ద్వారా బాధలన్నీ దూరమై సుఖ సంతోషాలు దక్కుతాయని పండితులు చెబుతారు. అయితే పురుషులు మాత్రమే కొబ్బరి కాయ కొట్టాలి. ఆడవాళ్లు కొబ్బరి కాయ పగులగొట్టవద్దని హిందూ శాస్త్రాల్లో నిషేధించారు. దానికి కారణం ఏంటంటే.. కొబ్బరి కాయ ఒక విత్తనం.. అలాగే స్త్రీలు సంతానానికి కారకులు. అంటే ఇద్దరూ సంతానానికి కారకులే కాబట్టి మహిళలను కొబ్బరి కాయ పగులగొట్టద్దని చెబుతారు. ఒకవేళ మహిళలు కొబ్బరి కాయను కొడితే వారి పిల్లల జీవితాల్లో అనేక సమస్యలు, ఇబ్బందులు వస్తాయని పండితులు హెచ్చరిస్తుంటారు. అంతేకాదు భార్యలు గర్భంతో ఉన్నప్పుడు భర్తలు కూడా కొబ్బరి కాయలను కొట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

పూజా కార్యక్రమాల్లో కొబ్బరి కాయ ఎందుకు వాడతారు?

పురాణాల ప్రకారం లక్ష్మీసమేతుడై విష్ణమూర్తి భూలోకానికి వచ్చినప్పుడు కొబ్బరి చెట్లను నాటాడని చెబుతుంటారు. వాళ్లిద్దరికీ కూడా కొబ్బరి చెట్టు చాలా ప్రీతికరమైనది అంటారు. అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. కాబట్టే పూజా కార్యక్రమాల్లో దీన్ని ఉపయోగిస్తారు.

Exit mobile version