Home Entertainment 69th National Film Awards 2023 | తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.. జాతీయ ఉత్తమ...

69th National Film Awards 2023 | తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్..

69th National Film Awards 2023 | చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక పుష్ప చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఉత్తమ నటిగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఇద్దరిని ఎంపిక చేసింది. గంగూభాయి కథియావాడీ చిత్రానికి గానూ ఆలియాభట్, మిమి చిత్రానికి గానూ కృతిసనన్‌ను బెస్ట్ యాక్ట్రెస్‌గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటితో పాటు మొత్తంగా 31 విభాగాల్లో ఫీచర్ ఫిలింస్, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిలింస్, మూడు విభాగాల్లో రచన విభాగానికి జాతీయ అవార్డులను ప్రకటించారు.

ఈ జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు హవా చూపించాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు అత్యధిక కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇక బాలీవుడ్‌లో గంగూబాయి కథియావాడీ చిత్రానికి అత్యధిక అవార్డులు వచ్చాయి.

జాతీయ అవార్డుల విజేతలు:

ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ ( పుష్ప )
ఉత్తమ నటి : ఆలియాభట్ ( గంగూబాయి కథియావాడీ), కృతిసనన్ ( మిమి)
ఉత్తమ చిత్రం : రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్ ( హిందీ)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం : ఉప్పెన ( తెలుగు ), సర్దార్ ఉద్దమ్ (హిందీ), ఛెల్లో షో ( గుజరాతీ), 777 చార్లీ (కన్నడ), హోమ్ (మలయాళం)
ఉత్తమ దర్శకుడు : నిఖిల్ మహాజన్ ( గోదావరి – మరాఠీ )
ఉత్తమ సహాయ నటుడు : పంకజ్ త్రిపాఠి ( మిమి)
ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి ( ది కశ్మీర్ ఫైల్స్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ : కింగ్ సాలమాన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (కొండపొలం)
ఉత్తమ స్క్రీన్ ప్లే : నాయట్టు (మలయాళం)
ఉత్తమ డైలాగ్స్ : సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కథియావాడీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : సర్దార్ ఉద్దమ్ ( అవిక్ ముఖోపాధ్యాయ)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ : శ్రేయా ఘోషల్ (ఇరివిన్ నిజాల్)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ మేల్ : కాలభైరవ ( ఆర్ఆర్ఆర్)
ఉత్తమ బాల నటుడు : భావిన్ రబారి ( చెల్లో షో – గుజరాతీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం : ఆర్ఆర్ఆర్
ఉత్తమ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
ఉత్తమ నేపథ్య సంగీతం : కీరవాణి ( ఆర్ఆర్ఆర్)
ఉత్తమ మేకప్ : ప్రీత్ శీల్ సింగ్ డిసౌజా ( గంగూబాయి కథియావాడీ)
ఉత్తమ కాస్ట్యూమ్స్ : వీర్ కపూర్ ( సర్దార్ ఉద్ధమ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : దిమిత్రి మలిచ్, మన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దమ్)
ఉత్తమ ఎడిటింగ్ : సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కథియావాడీ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : శ్రీనివాస మోహన్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సౌండ్ డిజైనింగ్ : అనీశ్ బసు (చైవిట్టు-మలయాళం )
ఉత్తమ రీరికార్డింగ్ : సినోయ్ జోసెఫ్ (జిల్లి డిస్కర్డ్స్ – బెంగాలీ)

Exit mobile version