Home Lifestyle Horoscope & Vaasthu Vasthu Tips | మంచంపై కూర్చొని భోజనం చేస్తున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!

Vasthu Tips | మంచంపై కూర్చొని భోజనం చేస్తున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!

Image by drobotdean on Freepik

Vasthu Tips | ఒకప్పుడు భోజనం అంటే ఇంట్లో వాళ్లంతా కింద కూర్చొని మాట్లాడుకుంటూ తినేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొంతమంది సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటుంటే.. మరికొందరేమో మంచం మీద కూర్చొని భోజనం చేస్తుంటారు. కానీ అలా తినడం అస్సలు మంచి పద్ధతి కాదు. వాస్తు, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఇలా మంచంపై కూర్చొని తినడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివెనుక పలు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి.

నేలపై పద్మాసనం వేసుకుని కూర్చొని భోజనం చేయడం మంచిది. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవు. తిన్న ఆహారం తొందరగా అరుగుతుంది. భోజనం చేసే ప్రదేశం ఎప్పుడూ శుచిగా ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం వంటగదిలో కూర్చొని భోజనం చేయడం వల్ల రాహువు ప్రసన్నం అవుతాడు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే మంచం మీద కూర్చొని మాత్రం అస్సలు తినవద్దని పెద్దలు చెబుతుంటారు.

ఎందుకంటే మంచం అనేది పడుకునే స్థలం. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మంచంపై కూర్చొని తినడం అనేది భోజనం చేయడం అవమానపరిచినట్లే. అన్నపూర్ణ దేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాదు రాహువు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దీనివల్ల ఇంట్లో సంపద హరిస్తుంది. అప్పులు పెరిగిపోతాయి. ఆనందం, శాంతి కూడా కోల్పోతారు. మంచంపై కూర్చొని తిని వెంటనే పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version