Home Lifestyle Devotional Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Image Source : Pixabay

Tulsi Puja | గురువారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజిస్తే కష్టాలన్నీ దూరమైపోతాయని నమ్ముతారు. విష్ణువుతో పాటు తులసిని పూజిస్తే కూడా ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాం. కాబట్టి గురువారం తులసి మాతను పూజిస్తే శ్రీమహావిష్ణువు కటాక్షం కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే గురువారం తులసి చెట్టును పూజించేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటిస్తూ పూజ చేస్తే ఇంట్లో ఎప్పుడూ అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలకు లోటు ఉండదని నమ్ముతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసి మాతకు పచ్చి పాలతో నైవేద్యం సమర్పించాలి. దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు. సాయంత్రం పూట తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. దీనివవల్ల లక్ష్మీ దేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని పండితులు చెబుతుంటారు.

చాలామంది గురువారం ఉపవాసం ఉంటారు. అలా ఉపవాసం ఉండే వాళ్లు తులసి కోటకు పూజ చేసేటప్పుడు పసుపు బట్టలు ధరించడం మంచిది. తులసి మాతను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. ఇంట్లో ఆనందం, ప్రశాంతత నెలకొంటుంది.

ఇంట్లోకి కొత్తగా తులసి మొక్కను తీసుకురావాలని అనుకుంటే..గురువారం మంచి రోజు అని పండితులు చెబుతున్నారు. గురువారం తులసి మొక్కతో పాటు శ్రీమహావిష్ణువు స్వరూపమైన అరటి చెట్టుకు నీళ్లు పోయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని, అప్పుల బాధ నుంచి బయటపడతారని అంటుంటారు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Exit mobile version