Home Lifestyle Devotional Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Black Thread | కాలికి నల్ల దారం కట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. చూడ్డానికి స్టైలిష్‌గా ఉండటంతో చాలామంది అమ్మాయిలు కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారు. అలా ఇది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. దీన్ని చూసి అబ్బాయిలు కూడా నల్ల దారం కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయినప్పటికీ.. కాలికి నల్ల దారం కట్టుకోవడం ఒక నమ్మకం. దిష్టి తగలకుండా నిత్యం కాపాడుతుందనే విశ్వాసం. అందుకే చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా దీన్ని కడుతుంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల చెడు దృష్టి తగలకుండా ఉంటుంది. అలాగే ఆర్థిక స్థితి కూడా బలంగా ఉంటుంది. పాదాల దగ్గర నల్ల దారం ధరించడం వల్ల శని గ్రహం ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. రాహు కేతువులు బలహీనంగా ఉన్న వారు నల్ల దారం కట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. దిష్టి తగలకుండా ఉండాలంటే ఈ నల్ల దారం ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోవద్దు. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి.

చిన్న పిల్లలకు అమావాస్య రోజు మాత్రమే నల్ల దారం కట్టాలి. ఒకసారి కట్టిన దిష్టిదారాన్ని నెల రోజులు మాత్రమే ధరించాలి. మళ్లీ అమావాస్యకు పాతది విప్పేసి కొత్త దారం కట్టుకోవాలి. అప్పుడే అది చక్కగా పనిచేస్తుందని పండితులు చెబుతుంటారు. అమావాస్య రోజు కాకుండా మిగిలిన రోజుల్లో దిష్టి దారం కట్టుకున్నా.. దాన్ని ఎక్కువ రోజులు ఉంచుకున్నా ఫలితం శూన్యమని సూచిస్తున్నారు. స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమ కాలికి మాత్రమే నల్ల దారం ధరించాలి. పురుషులైతే కుడి కాలికి కట్టుకోవాలి.

ఈ రాశుల వాళ్లు నల్ల దారం ధరించవద్దు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుల, కుంభ, ధనుస్సు రాశి వాళ్లు నల్ల దారం కట్టుకోవడం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. మేష, వృశ్చిక రాశి వాళ్లు మాత్రం చెడు ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశులపై అంగారక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంగారకుడికి నలుపు అంటే అస్సలు నచ్చదు. కాబట్టి ఈ రాశుల వాళ్లు నల్ల దారం ధరించడం వల్ల నెగెటివ్ రిజల్ట్స్ పొందే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version