Home Lifestyle Devotional Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Image by gpointstudio on Freepik

Dreams | కలలు ఎలాగైనా రావచ్చు. కొన్ని పీడకలలు వస్తే భయభ్రాంతులకు గురవుతుంటాం. మరికొన్ని కలలు మాత్రం మనసును రిలాక్స్‌ చేస్తుంటాయి. ఇవి కాకుండా అప్పుడప్పుడు చిత్రమైన కలలు వస్తుంటాయి. నిద్రపోతున్నట్టు, స్నానం చేస్తున్నట్టు ఇలా చిత్ర విచిత్రమైన కలలు వస్తుంటాయి. కొంతమందికి ఒంటరిగా స్నానం చేసినట్టుగా కలలు వస్తాయి. మరికొందరికి దంపతులు కలిసి స్నానం చేసినట్టుగా కూడా కలలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చే కలలకు కూడా అర్థాలు ఉంటాయని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు.

మంచి నీటితో స్నానం చేస్తున్నట్టుగా కలలు వస్తే శుభ సూచికం. త్వరలోనే శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్పడానికి సంకేతంగా ఇలా స్నానం చేస్తున్నట్టు కలలు వస్తుంటాయని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటారనే దానికి సంకేతంగా కూడా ఇలాంటి కలలు వస్తుంటాయట.

కాళ్లు కడుక్కుంటున్నట్టు రావడం కూడా మంచిదేనట. త్వరలోనే కష్టాల నుంచి గట్టెక్కబోతున్నారని ఈ కలలు సూచిస్తాయని అంటున్నారు.

మంచి నీటితో కాకుండా మురికి నీటితో స్నానం చేస్తున్నట్టు కలలు వస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టబోతున్నా.. ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా.. ఆ నిర్ణయాన్ని కొద్దిరోజులు వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. లేదంటే లేని పోని కష్టాలు, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Exit mobile version