Home Lifestyle Devotional vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

vasthu tips | ఇంట్లో చెత్త ఊడ్చే చీపురు ( Broom ) సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తుంటారు. కాబట్టి చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. చీపురును ఇంట్లో దాచిపెట్టాలన్నా.. పాడైపోయిన దాన్ని పడేయాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని తూచా తప్పకుండా పాటించాలి. లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదు. ఆర్థికంగా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి చీపురు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కడ పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం ధనం, ఆభరణాలు ఉండే చోట చీపురును ఉంచకూడదు. గోడకు ఆనించి నిలబట్టడం కూడా మంచిది కాదు. చీపురుతో పని అయిపోయిన తర్వాత ఎవరికీ కనిపించకుండా ఒక మూలకు లేదా తలుపు వెనకాల పెట్టాలి. అది కూడా నిలబెట్టకూడదు. పడుకోబెట్టాలి. బహిరంగ ప్రదేశాల్లో అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల పేదరికంతో బాధపడాల్సి వస్తుంది.

సాయంత్రం ఊడవద్దు

సూర్యాస్తమయం తర్వాత చీపురు పట్టకూడదు. ఒకవేళ ఇల్లు ఊడవాల్సి వచ్చినా చెత్తను ఒక మూలకు నూకాలి. అంతేతప్ప బయట పడేయకూడదు. శుభకార్యాలు జరిగే సమయంలోనూ చీపురును చూడటం మంచిది కాదు. పాడైపోయిన చీపురుతో ఇంటిని ఊడవకూడదు. అలా ఊడిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. చీపురును తొక్కినా కూడా లక్ష్మీదేవి ఆగ్రహం తెప్పించిన వాళ్లం అవుతాం. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎప్పుడు పడితే అప్పుడు పడేయొద్దు

పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే అప్పుడు పడేయడం మంచిది కాదు. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో ఏకాదశి తిథి నాడు పడేయకూడదు. శనివారం లేదా అమావాస్య రోజు మాత్రమే పడేయాలి. పడేసే ముందు ఎవరికీ చెప్పకూడదు. పారే కాలువలో అస్సలు పడేయొద్దు. కొత్త చీపురు కొనాలంటే మంగళ, శని, అమావాస్య రోజుల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. కృష్ణ పక్షంలో కొనడం మంచిది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Exit mobile version