Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (04-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు (04-03-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

వృషభం

సన్నిహితులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కారమవుతాయి. ఆరోగ్యసమస్యలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

మిథునం

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం

దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆప్తుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు లభిస్తాయి.

సింహం

ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

కన్య

దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ యత్నాలు సాగిస్తారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు.

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందతారు.

వృశ్చికం

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ యత్నాలు, ఫలిస్తాయి. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వస్తు లాభం పొందుతారు.

ధనుస్సు

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మకరం

మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. వస్తు సేకరణ అవకాశం ఉంది.

కుంభం

ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలతో లాభాలు పొందుతారు. రుణాలు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేసినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. క్రయవిక్రయాల్లో తొందరపాటు తగదు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

కొత్త కార్యక్రమాల్లో సన్నిహితుల నుంచి సహాయం అందిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version