Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు ( 19-02-2023)

Horoscope Today | రాశిఫలాలు ( 19-02-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం:

సుదూర ప్రాంత వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి విషయాల నుంచి బయటపడగలుగుతారు. శుభకార్య ప్రసంగాలను సాగిస్తారు.

వృషభం:

తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. ఉన్నతాధికారులకు బహుమతులను కానుకగా ఇస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

మిథునం:

ఆరోగ్యకరమైన జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను సానుకూల పరచుకోవడానికి అధికారులతో సమావేశమవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

కుటుంబపరమైన సమస్యలు వృత్తి మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయరు. నేర్పుగా ఎవరినీ నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు.

సింహం:

చర్చలు ప్రయాణాలు ఫలిస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమైన ఓ స్థానమునకు అవకాశం లభిస్తుంది. జాగ్రత్తగా ఉపయోగించుకోండి.

కన్య:

హక్కుల కోసం న్యాయ పోరాటాన్ని సాగిస్తారు. సనాతన సంప్రదాయ విషయాల మీద ఆసక్తిని కనబరుస్తారు. అయాచితపరంగా అనుకూలమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

తుల:

కోపతాపాలకు దూరంగా ఉండండి. విలువైన సమాచారాన్ని సకాలంలో అందుకుంటారు. శత్రువులను గుర్తించి వారిని జయించడానికి గాను తగు వ్యూహాలను సిద్ధం చేసుకుంటారు.

వృశ్చికం:

స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపుతారు. అయితే చాలా మెలకువ అవసరం సంతాన విద్యా అవసరాలపైన దృష్టిని సారిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది.

ధనుస్సు:

విదేశీ విద్యా, ఉద్యోగ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు అనుకూలం. గతంలో చేసిన ప్రయత్నాలకు గాను నేడు అనుకూల ఫలితాలు లభిస్తాయి.

మకరం:

ఆర్థిక వసలుబాటు లభిస్తుంది. స్తంభించిన కార్యక్రమాలలో కదలిక ఏర్పడుతుంది. స్నేహితులు బంధువుల విషయాలను కూడా మీవిగా భావించి తగు సహాయాన్ని అందిస్తారు.

కుంభం:

కుటుంబ విషయాలలో గోప్యత అవసరం. స్థిరంగా ఆలోచించి మాట్లాడటం సమాధానం చెప్పడం వలన చాలా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు.

మీనం:

వ్యవసాయరంగంలోని వారికి అనుకూలం. పెద్దగా ఉపయోగం లేని ప్రయాణాలను చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. లావాదేవీలు పూర్తి ఆర్థిక పథకముల్ల నిధుల వినియోగం లాభిస్తాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version