Home News AP Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు

Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు

Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటుతో 23 రోజుల పాటు ఆస్పత్రితో చికిత్స పొందిన తారకరత్న కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పేరిట జనవరి 28న కుప్పంలో చేపట్టిన పాదయాత్రలో నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చింది. పాదయాత్రలో భాగంగా కుప్పం దగ్గరలో ఉన్న మసీదులో కూడా లోకేశ్ ప్రార్థనలు నిర్వహించారు. అప్పుడు లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లగా.. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. గాలి ఆడటం లేదని.. కొంచెం జరగాలని సిబ్బంది ఎంత చెప్పినా అభిమానులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరి అందక సొమ్మసిల్లి పడిపోయాడు. హుటాహుటిన తారకరత్నను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడి వైద్యులు తారకరత్నను పరీక్షించి గుండెపోటుగా నిర్ధారించారు.

అయితే తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో అదే రోజు రాత్రి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. గుండెనాళాల్లోకి రక్తం సరఫరా కావడం లేదని గమనించిన నారాయణ హృదయాలయ వైద్యులు.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నించారు. ఆ తర్వాత పలు పరీక్షలు చేయగా.. తీవ్ర గుండెపోటుతో బ్రెయిన్ డ్యామేజీ అయినట్లు గుర్తించారు. దీంతో విదేశాల నుంచి వైద్యులను రప్పించి మరీ చికిత్స అందించారు. కానీ లాభం లేకుండాపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని కౌంటర్

Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు.. కేఏ పాల్‌కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

Exit mobile version