Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు (02-03-2023 )

Horoscope Today | రాశి ఫలాలు (02-03-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్థి పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం పొందుతారు.

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అసవరం. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు.

మిథునం

మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు.

కర్కాటకం

ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

సింహం

బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఉద్యోగులకు స్థానమార్పు ఉండవచ్చు.

కన్య

మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరమై ఊరట చెందుతారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. వస్తు లాభం పొందుతారు.

తుల

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

వృశ్చికం

మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వాహనాల విషయంలో మెలకువ అవసరం. పనుల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం పొందుతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి సహాయం పొందుతారు.

మకరం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సాయం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఉద్యోగాల్లో అనుకూలమైన మార్పులు పొందుతారు.

కుంభం

మిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు అనువైన కాలం. విందు, వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

మీనం

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. శ్రమ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. సంతానం నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version