Home Latest News WPL 2023 Auction | మహిళల ఐపీఎల్ వేలంలో స్మృతి మంధన్నాకు రికార్డు ధర.. సెకండ్...

WPL 2023 Auction | మహిళల ఐపీఎల్ వేలంలో స్మృతి మంధన్నాకు రికార్డు ధర.. సెకండ్ ఎవరంటే..

WPL 2023 Auction | మహిళల ప్రీమియర్ లీగ్ ( డబ్ల్యూపీఎల్ ) వేలం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేలంలో స్టార్ ప్లేయర్లను దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఐదు ఫ్రాంచైజీలు కూడా పోటీపడ్డాయి. 409 మందితో కూడిన క్రికెటర్ల జాబితాలో 90 మంది కోసం ఈ ఐదు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి.

తొలి రౌండ్ వేలం ముగిసేలోపు భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధన్నా అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఈమెను 3.4 కోట్ల ధరకు సొంతం చేసింది. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెరట్ ఆప్లీ గార్డనర్ నిలిచింది. ఈమె కోసం ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ పోటీ పడ్డాయి. కానీ చివరకు గుజరాత్ జెయింట్స్ రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. దీప్తి శర్మను రూ.2.6 కోట్లకు యూపీ సొంతం చేసుకుంది.

హర్మన్ ప్రీత్ కౌర్‌ను కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, యూపీ వారీయర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. కానీ 1.80 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్ కోసం యూపీ, ఢిల్లీ పోటీపడగా.. రూ.1.80 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ఆసీస్ ప్లేయర్ ఎలిస్ పెర్రీని రూ.1.70 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. రేణుకా సింగ్‌ను రూ.1.5కోట్లు ఆర్సీబీ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్2ను కనీస ధర రూ.50 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sachin Tendulkar | జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్‌ ప్రతిభకు సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా..

Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీని దాటేసిన మహమ్మద్‌ షమీ..

Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Exit mobile version