Home Latest News Sachin Tendulkar | జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్‌ ప్రతిభకు సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా..

Sachin Tendulkar | జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్‌ ప్రతిభకు సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా..

Sachin Tendulkar | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రతిభావంతులను అభినందించడంలో ఎప్పుడూ ముందుంటాడు. క్రికెట్‌ మాత్రమే కాకుండా.. వేరే క్రీడల్లోనూ రాణిస్తున్న ఆటగాళ్లలో మాస్టర్‌ స్ఫూర్తి నింపుతుంటాడు. అలాంటి ఈ బ్యాటింగ్‌ దిగ్గజం.. జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్‌ ప్రతిభను ఆకాశానికెత్తాడు.

బౌండ్రీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తూ.. ఒకే సారి క్రికెట్‌, ఫుట్‌బాల్‌ కలిపి ఆడిన ప్లేయర్‌ను ట్విట్టర్‌ వేదికగా అభినందించాడు. టీ20 క్రికెట్‌ ప్రాచూర్యం పొందిన తర్వాత బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌లు ఎక్కువైపోగా.. ఇటీవలి కాలంలో కొందరు ఆటగాళ్లు అద్భుతమైన ఫీట్స్‌తో కండ్లు చెదిరే క్యాచ్‌లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. బంతి గీత దాటుతుందనుకుంటే.. ఎగిరి గాల్లోనే దాన్ని అందుకొని తిరిగి మైదానంలోకి విసిరి తాపీగా వచ్చి క్యాచ్‌ పూర్తి చేసిన సందర్భాలు ఇటీవలా చాలా చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం సచిన ప్రశంసించిన ప్లేయర్‌ మాత్రం ఇందుకు భిన్నంగా ఫుట్‌బాల్‌ కిక్‌తో బాల్‌ను తన సహచరుడికి అందేలా చేయడం కొసమెరుపు..

ఆహా ఏమా క్యాచ్‌..

జిల్లా క్రికెట్‌ క్లబ్‌లో భాగంగా ఒక టెన్నిస్‌ బాల్‌ మ్యాచ్‌లో.. బౌలర్‌ ఆఫ్‌స్టంప్‌ అవతల వేసిన బంతిని బ్యాటర్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. బంతి చాలా దూరం వెళ్లడంతో అంతా సిక్సర్‌ అనే నిశ్చయానికి వచ్చేశారు. అక్కడే అద్భుతం ఆవిష్కృతమైంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఆటగాడు అమాంతం గాల్లోకి ఎగిరి బంతి అందుకొని ఉంటాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే! బౌండ్రీ అంచున బంతిని ఒడిసి పట్టుకున్న ఫీల్డర్‌.. బ్యాలెన్స్‌ ఆపుకోలేక బయటికి పడిపోతున్నట్లు గ్రహించి.. తిరిగి బాల్‌ను గాల్లోకి ఎగరేశాడు.

అయితే అది కాస్తా గీతకు ఎక్కువ దూరం వెళ్లగా.. అక్కడే తన ఫుట్‌బాల్‌ ప్రావీణ్యాన్ని కనబర్చిన ఆ ప్లేయర్‌.. సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను తలపిస్తూ.. బ్యాక్‌వ్యాలీ కిక్‌ క్టొటాడు. అంతే బంతి అమాంతం మైదానంలో ఉన్న మరో ఫీల్డర్‌ వద్దకు చేరింది. అతడు సేఫ్‌గా అందుకోవడంతో క్యాచ్‌ పూర్తైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ ఫీల్డర్‌ విన్యాసాన్ని సచిన్‌ టెండూల్కర్‌ సహా పలువురు అంతర్జాతీయ క్రికెటర్‌లు మెచ్చుకుంటున్నారు.

‘ఫుట్‌బాల్‌ తెలిసిన ఆటగాడిని క్రికెట్‌లోకి తీసుకొస్తే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి’ అని సచిన్‌ ట్వీట్‌ చేయగా.. ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌ మైకెల్‌ వాన్‌.. ‘ఇది కచ్చితంగా గ్రేటెస్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అని పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ ‘నిజంగా ఇది ఔట్‌స్టాండింగ్‌’ అని ప్రశంసలు కురిపించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hardik Pandya | మళ్లీ పెళ్లికి సిద్ధమైన హార్దిక్ పాండ్యా.. అమ్మాయి ఎవరో తెలుసా!

Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీని దాటేసిన మహమ్మద్‌ షమీ..

Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Exit mobile version