Home Latest News Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

Ravindra Jadeja | టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. జడేజా ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సందర్భంగా జడేజా చేతికి అయింట్మెంట్ రాసుకోవడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అతనికి భారీ జరిమానా విధించింది.

ఈ జరిమానాలో భాగంగా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమాళిలోని ఆర్టికల్ 2.20 ను జడేజా అతిక్రమించినట్లు ఈ సందర్భంగా ఐసీసీ తెలిపింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్దమని వెల్లడించింది. క్రమశిక్షణా చర్యల కింద జడేజాకు ఫైన్ వేయడంతో పాటు ఒక పాయింట్‌ను కూడా డీమెరిట్ చేశారు. గడిచిన 2 సంవత్సరాలలో జడేజాకు ఇదే మొదటి తప్పు అయ్యింది.

ఫిబ్రవరి 9 వ తేదీన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు 46వ ఓవర్ లో జడేజా తన ఇండెక్స్ ఫింగర్‌కు సూత్నింగ్ క్రీమ్ రాసుకున్నాడు. సిరాజ్ నుంచి క్రీమ్ తీసుకున్న అతను ఎడమ చేతి చూపుడు వేలికి రుద్దాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, అభిమానులు జడేజా చీటింగ్ చేశాడని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన బీసీసీఐ జడేజా వేలికి రాసుకున్నది నొప్పిని తగ్గించే క్రీమ్ అని క్లారిటీ ఇచ్చింది. ఇండెక్స్ ఫింగర్‌కు వాపు రావడం వల్ల జడేజా క్రీమ్ రద్దుకున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ల పర్మిషన్ లేకుండా అలా చేసినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ తప్పును జడేజా అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్ ఈ శిక్షను ఖరారు చేశారు. లెవల్ వన్ ఉల్లంఘన కింద జడేజాకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Srikar Bharat | ఇది శ్రీకారం మాత్రమే.. అరంగేట్రంపై శ్రీకర్‌ భరత్‌ వ్యాఖ్య

Exit mobile version