Home Entertainment Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన...

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Nayanthara | లేడీ సూపర్‌స్టార్‌ నయనతార పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలకు కమిట్‌ అవుతూ ఫుల్‌ బిజీగా గడిపేస్తుంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తూనే.. స్టార్‌ హీరోలతో జత కడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌తో జవాన్‌ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అజిత్‌కుమార్‌ ఏకీ62 సినిమాకు కమిట్‌ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి నయనతార తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి తప్పుకోవడమే కాదు.. ఇకపై అజిత్‌ సినిమాల్లో నటించనని మంగమ్మ శపథం కూడా పూనిందని సమాచారం.

తమిళంలో నయనతార, అజిత్‌కుమార్‌ ఇద్దరిదీ హిట్‌ జోడీ. వీళ్లద్దరూ కలిసి నటించిన బిల్లా, ఆయిగన్‌ ( మల్లిక ), ఆరంభం, విశ్వాసం నాలుగు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో AK62 మూవీని నయనతార భర్త, కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ ప్లాన్‌ చేశాడు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి విఘ్నేశ్‌ శివన్‌ను అజిత్‌, లైకా ప్రొడక్షన్స్‌ తప్పించారని టాక్‌ నడుస్తోంది. విఘ్నేశ్‌ శివన్‌ చెప్పిన కథ నచ్చకపోవడంతో అతన్ని ఈ సినిమా నుంచి తప్పించారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన నయనతార.. తన భర్త తరఫున అజిత్‌, లైకా ప్రొడక్షన్స్‌ను కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేసిందట. కానీ వాళ్లు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో తన భర్తను అవమానించిన హీరోతో ఇకపై నటించవద్దని నయనతార నిర్ణయం తీసుకుందట. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Nawazuddin Siddiqui | అతని కోసం నా లైఫ్‌లో 18 ఏళ్లు వేస్ట్‌ చేశా.. కన్నీళ్లు పెట్టుకున్న నవాజుద్దీన్‌ భార్య ఆలియా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Pawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Exit mobile version