Home Latest News Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Rishabh Pant | టైమ్‌2న్యూస్‌, న్యూఢిల్లీ: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరమైన టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరమవుతాడనుకున్న పంత్‌.. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకొని నడక ప్రారంభించాడు. రెండు కర్రల సాయంతో నడుస్తున్న ఫొటోను శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. ‘ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మరింత మెరుగ్గా’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు.

పవర్‌ హిట్టింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్న రిషబ్‌ పంత్‌ అనతి కాలంలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. విదేశాల్లో జరిగిన టెస్టుల్లో కీలక సమయాల్లో భారీ ఇన్నింగ్స్‌లతో తనపై ఆశలు పెంచిన పంత్‌.. ఆస్ట్రేలియాపై 2021-22లో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్న పంత్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్న విషయం తెలిసిందే!

గతేడాది చివర్లో.. రిషబ్‌ పంత్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు న్యూఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ బయల్దేరిన పంత్‌.. మార్గమధ్యలో రూర్కీ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. కారు డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే అద్దలు పగలగొట్టుకొని పంత్‌ బయటకు వచ్చే ప్రయత్నం చేయగా.. అది గమనించిన వాళ్లు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. పంత్‌ ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న బస్సు డ్రైవర్‌ అతడిని కాపాడగా.. కాస్త కోలుకున్న తర్వాత పంత్‌ అతడికి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

ఉత్తరాఖండ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ కొనసాగుతున్న పంత్‌ చికిత్స విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీసీసీఐ తక్షణ చర్యలు చేపట్టింది. మొదటి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్‌కు తరలించారు. ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ కోసం పంత్‌ను బీసీసీఐ వైద్య బృందం ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ముంబైకి తీసుకొచ్చింది. ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో గత నెల పంత్‌ మోకాలికి సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే చికిత్స పొందిన పంత్‌.. తాజాగా కర్ర సాయంతో నడుస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో పంత్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పంత్‌ గైర్హాజరీలో ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అవకాశం దక్కించుకున్నాడు. గత నాలుగేండ్లుగా జట్టుతో కొనసాగుతున్న భరత్‌.. బెంచ్‌కే పరిమితం కాగా.. ప్రమాదం కారణంగా పంత్‌ జట్టుకు దూరమవడంతో ఇప్పుడు చాన్స్‌ దక్కించుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | రఫ్ఫాడించిన రోహిత్.. రెండో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం

Rohit Sharma | మాటల్లో కాదు చేతల్లో పోటీపడండి.. కంగరూలకు రోహిత్‌శర్మ చురక

Srikar Bharat | ఇది శ్రీకారం మాత్రమే.. అరంగేట్రంపై శ్రీకర్‌ భరత్‌ వ్యాఖ్య

Exit mobile version