Home Latest News WPL Auction | ఆల్‌రౌండర్లకు అందలం.. డబ్ల్యూపీఎల్‌ వేలంలో కోట్లు కొల్లగొట్టిన స్మృతి, దీప్తి, జెమీమా,...

WPL Auction | ఆల్‌రౌండర్లకు అందలం.. డబ్ల్యూపీఎల్‌ వేలంలో కోట్లు కొల్లగొట్టిన స్మృతి, దీప్తి, జెమీమా, షఫాలీ, పూజ, రిచా, హర్మన్‌ప్రీత్‌కౌర్‌

WPL Auction | టైమ్2న్యూస్, ముంబై: భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధన్నాకు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలంలో భారీ ధర దక్కింది. ఈ ఏడాది నుంచి ఐదు జట్లతో కూడిన డబ్ల్యూపీఎల్‌ ప్రారంభమవుతుండగా.. అందుకోసం సోమవారం ముంబైలో వేలం నిర్వహించారు. ఇందులో స్మృతి మంధన్నా రికార్డు స్థాయిలో రూ. 3.40 కోట్లు దక్కించుకుంది. భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రూ. 1.8 కోట్లకు అమ్ముడుపోయింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) భారీ ధరతో స్మృతిని దక్కించుకుంటే.. ముంబై ఇండియన్స్‌ హర్మన్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటుండగా.. అనూహ్య ధర పలకడంతో.. వేలం టీవీలో వీక్షిస్తున్న అమ్మాయిలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన వరల్డ్‌కప్‌ పోరులో దంచికొట్టిన భారత ప్లేయర్‌ జెమీమా రోడ్రిగ్స్‌పై కనకవర్షం కురిసింది. ఢ్లిలీ క్యాపిటల్స్‌ జట్టు జెమీమా కోసం రూ. 2.2 కోట్లు వెచ్చించడం విశేషం. ఇక దేశానికి తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌ అందించిన యువ ఓపెనర్‌ షఫాలీ వర్మను కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రెండు కోట్లకు కొనుగోలు చేసుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ కోసం ఆర్సీబీ రూ.1.9 కోట్లు వెచ్చించగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్‌ దక్కించుకుంది.

కోటీశ్వరులు వీళ్లే..

స్మృతి మంధాన (ఆర్సీబీ) – రూ. 3.4 కోట్లు

నటాలియా స్కీవర్‌ (ముంబై) – రూ. 3.2 కోట్లు

ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌) – రూ. 3.2 కోట్లు

దీప్తి శర్మ (యూపీ) – రూ.2.6 కోట్లు

జెమీమా రోడ్రిగ్స్‌ (ఢిల్లీ) – రూ. 2.2 కోట్లు

బెత్‌ మూనీ (గుజరాత్‌) – రూ. 2 కోట్లు

షఫాలీ వర్మ (ఢిల్లీ) – రూ. కోట్లు

పూజ వస్త్రాకర్‌ (ముంబై) – రూ.1.9 కోట్లు

రిచా ఘోష్‌ (ఆర్సీబీ) – రూ.1.9 కోట్లు

సోఫీ ఎకెల్‌స్టోన్‌ (యూపీ) – రూ. 1.8 కోట్లు

హర్మన్‌ప్రీత్‌ (ముంబై) – రూ. 1.8 కోట్లు

ఎలిసా పెర్రీ (ఆర్సీబీ) – రూ. 1.7 కోట్లు

రేణుకా సింగ్‌ (ఆర్సీబీ) – రూ. 1.5 కోట్లు

యష్తిక భాటియా (ముంబై) – రూ. 1.5 కోట్లు

తలిహా మెక్‌గ్రాత్‌ (యూపీ) – రూ. 1.4 కోట్లు

మెగ్‌ లానింగ్‌ (ఢిల్లీ) – రూ.1.1 కోట్లు

షబ్నమ్‌ ఇస్మాయిల్‌ (యూపీ) – రూ. 1 కోటి

అమేలియా కెర్‌ (ముంబై) – రూ. 1 కోటి

వేలం విశేషాలు..

➣ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌.

➣ డబ్ల్యూపీఎల్‌ వేలంలో మొత్తం 449 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. వీరిలో 246 మంది భారత ప్లేయర్లు 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.

➣ ఒక్కో జట్టు ప్లేయర్ల కోసం అత్యధికంగా 12 కోట్లు వెచ్చించనుంది.

➣ వేలంలో ఫ్రాంచైజీలు అత్యధికంగా 18 మంది జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వీరిలో ఆరుగురు విదేశీయులు ఉండవచ్చు.

అటు 18.. ఇటు 18

పురుషుల ఐపీఎల్లో విరాట్‌ కోహ్లీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మహిళల విభాగంలో ఆ జట్టు స్మృతి మంధానను కొనుగోలు చేసుకుంది. వీరిద్దరూ భారత జట్ల తరఫున ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినవాళ్లే కాగా.. వీరి జెర్సీ నంబర్లు సైతం 18 కావడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sachin Tendulkar | జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్‌ ప్రతిభకు సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా..

Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీని దాటేసిన మహమ్మద్‌ షమీ..

Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Exit mobile version