Home Entertainment Posani Krishnamurali | ఎప్పుడూ నవ్వించే పోసాని జీవితంలో ఇంత విషాదం ఉందా? నాన్న ఆత్మహత్యను...

Posani Krishnamurali | ఎప్పుడూ నవ్వించే పోసాని జీవితంలో ఇంత విషాదం ఉందా? నాన్న ఆత్మహత్యను తలచుకుని ఎమోషనల్‌

Posani Krishnamurali | సినీ నటుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రైటర్‌గా ఎన్నో పవర్‌ఫుల్‌ మాటలు రాశాడు. నటుడిగా మారిన తర్వాత పలు సీరియస్‌ పాత్రలో మెప్పించాడు. ఆ తర్వాత కమెడియన్‌గా నవ్వులు పూయించాడు. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా పలు సందేశాత్మక చిత్రాలు తీసి సక్సెస్‌ అయ్యాడు. ఇలా చలన చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాలపై ప్రావీణ్యం ఉన్న పోసాని జీవితంలో ఎంతో విషాదం ఉంది. తన చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించాడు. దీని వెనుక ఓ విషాద గాథ ఉంది. తాజాగా యాంకర్‌ సుమ హోస్ట్‌ చేస్తున్న ఓ టాక్‌షోలో పాల్గొన్న పోసాని కృష్ణమురళి.. తన తండ్రిని తలచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

ప్రస్తుతం యాంకర్‌ సుమ ఓ టీవీ ఛానెల్‌లో సుమ అడ్డా పేరిట ఓ టాక్‌షో నిర్వహిస్తోంది. దీనికి కమెడియన్‌ అలీతో కలిసి పోసాని కృష్ణమురళి గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా పోసానిని తన తండ్రి గురించి సుమ అడిగింది. దీంతో పోసాని ఎమోషనల్‌ అయ్యాడు. తన చిన్నతనంలోనే చనిపోయాడంటూ భావోద్వేగానికి గురయ్యాడు. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కానీ ఎవడో తనకు పేకాట ఆడటం నేర్పించాడు. నాన్న పేకాట ఆడటం చూసి ఊళ్లో వాళ్లు అడిగేవాళ్లు. ఎందుకు సుబ్బారావు ఎలా చేస్తున్నావు అని అడిగేవాళ్లు. దీంతో తనలో తనే ఆలోచించుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. అక్కడ పెద్ద డబ్బాలో ఉన్న పురుగుల మందు తాగేశాడు. అని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన తాజాగా విడుదలైన ప్రోమో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

Exit mobile version