Home Entertainment K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను...

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K Viswanath | తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ కెరీర్ సౌండ్ ఇంజనీర్‌గా మొదలైంది. అక్కడ విశ్వనాథ్ పనితనం మెచ్చిన దిగ్గజ దర్శకులు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ పనిచేశాడు. ఆ సమయంలోనే విశ్వనాథ్ టాలెంట్ గుర్తించిన ఏఎన్నార్, దుక్కిపాటి మధుసూదనరావు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలైంది. అయితే ఈ సినిమా సమయంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది.

ఆత్మ గౌరవం సినిమా షూటింగ్‌కు హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ముహూర్తం పెట్టారు. సంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన విశ్వనాథ్ దైవ భక్తుడు. డైరెక్టర్‌గా తన తొలి షాట్‌ను దేవుడి ఫొటోల మీద తీయాలని కె.విశ్వనాథ్ అనుకున్నాడు. కానీ నిర్మాత దుక్కిపాటి పరమ నాస్తికుడు. దేవుడి ఫొటోల మీద షాట్ తీస్తానంటే ఒప్పుకోడు. ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో కె.విశ్వనాథ్‌కు ఒక ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించి ఫస్ట్ షాట్‌ను తెలివిగా అద్దంపై పెట్టాడు. అద్దం లక్ష్మీదేవి స్వరూపం కనుక తన కోరిక నెరవేరుతుంది.. దుక్కిపాటి కూడా అడ్డు చెప్పలేడు. అని అలా సెట్ చేశాడు.

కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్‌లో ముందు అద్దం చూపిస్తారు. కొద్ది క్షణాల్లోనే అద్దం మీద నుంచి అక్కినేని మీదకు కెమెరా వచ్చేలా సెట్ చేశారు. తన ప్లాన్ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. విశ్వనాథ్ సెంటిమెంట్ కూడా నిలిచి కళాతపస్విగా పేరు తెచ్చుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌ – Time2news.com

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

Exit mobile version