Home News International Free Flight Tickets | హాంకాంగ్ బంపర్ ఆఫర్.. 5 లక్షల మందికి ఫ్రీగా విమాన...

Free Flight Tickets | హాంకాంగ్ బంపర్ ఆఫర్.. 5 లక్షల మందికి ఫ్రీగా విమాన టికెట్లు

Image by 4045 on Freepik

Free Flight Tickets | తమ దేశం రావాలని అనుకునేవాళ్లకు హాంకాంగ్ బంపర్ ఆఫర్ ప్రారంభించింది. 5 లక్షల మందికి ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు హాంకాంగ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కొవిడ్ ఆంక్షల కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగానికి పునర్వైభవం తీసుకురావాలని హాంకాంగ్ భావిస్తుంది. ఈ క్రమంలోనే పర్యాటకులను ఆకర్షించేందుకు హాలో హాంకాంగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఫ్రీగా విమాన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ఎగ్జిక్యూటివ్ అధికారి జాన్ లీ ఒక ప్రకటన చేశారు.

హలో హాంకాంగ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా హాంకాంగ్ ఎయిర్‌లైన్స్, హాంకాంగ్ ఎక్స్‌ప్రెస్, కాథీ ఎక్స్‌ప్రెస్ సంస్థలు మార్చి 1 నుంచి ఈ విమాన టికెట్లను అందజేయనున్నాయి. వీటి విలువ దాదాపు 2 బిలియన్ హాంకాంగ్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.2వేల కోట్లకు పైమాటే. బై వన్ గెట్ వన్, లక్కీ డ్రాల ద్వారా ఈ టికెట్లను అందజేయనున్నారు. వీటితో పాటు పర్యాటకులకు స్పెషల్ ఆఫర్స్, వోచర్స్, రిబేట్స్ ఇవ్వనుంది. చైనా, ఐరోపాలతో పాటు అమెరికాల్లోని పర్యాటకులకు ముందుగా వీటిని అందించనున్నారు.

హలో హాంకాంగ్ ప్రచార కార్యక్రమం ద్వారా 15 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు వేసవిలో హాంకాంగ్ వాసులు విదేశాలకు వెళ్లొచ్చేందుకు 80 వేల విమాన టికెట్లు అందజేయాలని కూడా నిర్ణయించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

Exit mobile version