Home Entertainment K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | నటుడిలోని కళను బయటకు తీసుకురావడంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ దిట్ట. ఆయన సినిమాల్లో నటిస్తే ఎంత పెద్ద నటుడు అయినా సరే ఇంకా రాటుదేలతాడు. అందుకే పెద్ద పెద్ద హీరోలు సైతం కె.విశ్వనాథ్ సినిమాల్లో నటించే అవకాశం కోసం ఎదురుచూసేవాళ్లు. వాళ్లంతా ఆయన్ను గురువులా చూసేవారు. కె.విశ్వనాథ్ కూడా అంతే. తన సినిమాలో నటించే ప్రతి ఆర్టిస్టును తన పిల్లలాగే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.

కమల్ హాసన్‌తో సాగరసంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం సినిమాలు తీశాడు కె.విశ్వనాథ్. ఈ మూడు సినిమాలు కూడా కమల్‌హాసన్‌లోని అసలు నటుడిని బయటపెట్టాయి. ఇందులో స్వాతిముత్యం సినిమాలో శివయ్య అనే అమాయకపు, లోకజ్ఞానం లేని శివయ్య అనే గ్రామీణ యువకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభమైంది. క్యారెక్టర్ ప్రకారం శివయ్య కాస్త బొద్దుగా కనిపించాలి. కానీ కమల్ అప్పటికి చాలా సన్నగా ఉన్నాడు. తొలిరోజు షూటింగ్ అయ్యాక కమల్ హాసన్‌ను కె.విశ్వనాథ్ పిలిపించుకున్నారు. ఇదేం బాలేదు.. నువ్వు చాలా సన్నగా ఉన్నావ్ అని చెప్పారు. ఏం చేద్దామని కమల్ అడుగబోతుంటే.. ఓ స్వీట్ ప్యాకెట్ తెప్పించి అతని ముందు పెట్టేశాడు. స్వీట్స్ తినమని కమల్‌కు కె.విశ్వనాథ్ చెప్పారు. కమల్ ఒక స్వీట్ తీసుకుని వదిలేస్తే.. ఈ మొత్తం నీకే తినేసేయ్ అని చెప్పారు. అలా స్వీట్స్ తిని కమల్ హాసన్ కాస్త లావు అయ్యాక ఆ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ విషయాన్ని గత ఏడాది జరిగిన సైమా వేడుకల్లో రాధిక బయటపెట్టింది. తన దగ్గర ఉండే ఆర్టిస్టులను కె.విశ్వనాథ్ ఎంత బాగా చూసుకుంటారో వివరించింది. రాధిక చెప్పిన ఈ మాటలు విని తన విషయంలో కూడా కె.విశ్వనాథ్ తీసుకున్న జాగ్రత్తల గురించి మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

స్వయంకృషి సినిమా టైమ్‌కి చిరంజీవి కాస్త లావుగా ఉన్నాడు. దీంతో సన్నబడాలని మధ్యాహ్న భోజనం ఆపేశాడు. ఓ రోజు సీన్ అయిపోయి.. లంచ్ గ్యాప్‌లో చిన్న కునుకు వేశారు. షూట్‌కి టైమ్ అయ్యింది. చిరంజీవి వెళ్లకపోయేసరికి భోజనం దగ్గర కూర్చొన్న చిరు ఇంకా రాడా? అని సిబ్బందిని అడిగారు. దీనికి వాళ్లు లేదండీ.. ఆయన భోజనం చేయడం లేదు అని అసలు విషయం చెప్పారు. దీనికి విశ్వనాథ్.. ఏంటి ఆకలితో ఉంటాడా? ఖాళీ కడుపుతో ఉన్నవాడితో ఎలా పనిచేయించుకుంటాం. తినమని చెప్పారు. దానికి ఆయనకు అలవాటేనండీ అంటూ చిత్ర యూనిట్ సమాధానమిచ్చింది. దీంతో లాభం లేదని విశ్వనాథ్ స్వయంగా పెరుగన్నం కలిపి చిరంజీవి బెడ్ దగ్గర పెట్టారు. చిరంజీవి లేచి చూసేసరికి పక్కన పెరుగన్నం ఉంది. అప్పుడే చిత్ర సిబ్బంది జరిగిన విషయం చెప్పారు. దీంతో ఆ పెరుగన్నాన్ని ప్రసాదంగా భావించి చిరంజీవి తిన్నారు. సైమా వేడుకల్లో ఈ విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి అప్పుడప్పుడే హీరోగా ఆఫర్లు పొందుతున్న టైమ్‌లో శుభలేఖ సినిమాతో కె.విశ్వనాథ్ మంచి హిట్ ఇచ్చాడు. అప్పట్నుంచి సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్సులు, ఫైట్స్‌తో కమర్షియల్ హీరోగా మారిపోయాడు. అలాంటి టైమ్‌లో స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలు తీసి చిరంజీవిలోనూ మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు. అందుకే కె.విశ్వనాథ్ అంటే చిరంజీవి అంత అభిమానం చూపిస్తాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌ – Time2news.com

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

Exit mobile version