Home Entertainment K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K.Viswanath | కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించారు. వాటిలో ఏ సినిమాను చూసినా మనసుకు చెప్పలేని ఒక హాయిని అందిస్తాయి. అలాంటి అద్భుతమైన చిత్రాల్లో ఒక సినిమా కె.విశ్వనాథ్‌ను ఎంతగానో బాధపెట్టిందట. అసలు ఈ సినిమా ఎందుకు మొదలుపెట్టాన్నా దేవుడా అనుకునేలా చేసిందట. ఈ విషయాన్ని అప్పట్లో స్వయంగా కె.విశ్వనాథ్‌ తెలిపారు.

అంతలా కళాతపస్విని చిత్రవధ చేసిన సినిమా ఏంటని అనుకుంటున్నారా.. అదే సిరివెన్నెల సినిమా. సర్వధామన్‌ బెనర్జీ, సుహాసిని, మున్‌మున్‌ సేన్‌ ప్రధాన పాత్రలో సంగీత నేపథ్యంలో వచ్చిన సినిమా ఆయనకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిందట. ఈ సినిమా కథ విషయానికొస్తే మాటలు రాని ఒక అమ్మాయి.. కళ్లు కనబడని అబ్బాయి.. వీళ్లిద్దరి మధ్య సుందరమైన ప్రేమకావ్యం.. దానికి సంగీతం ఓ వారథి. ఈ సినిమా ఆలోచన వచ్చినప్పుడు బాగానే ఉందట.

కానీ మాటలు రాని అమ్మాయికి.. కళ్లు కనబడని అబ్బాయికి మధ్య ప్రేమను ఎలా పుట్టించాలి? వాళ్ల మధ్య సన్నివేశాలను ఎలా క్రియేట్‌ చేయాలనేది ఒక సవాలుగా మారిందట. అప్పటికే సినిమా చిత్రీకరణ మొదలైంది. కాబట్టి మధ్యలో ఆపేయలేము.. ఏదోలా ముగించలేమని కె.విశ్వనాథ్ ఎంతో మనోవేధన పడ్డాడు. ఏదో పైపైన సన్నివేశాలు రాస్తే సరిపోదు.. అవి ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉండాలి. అలాంటి సన్నివేశాలను రాసేందుకు రాత్రిపగలు నిద్ర లేకుండా కష్టపడ్డాడు కె.విశ్వనాథ్‌. దీంతో అసలు ఈ కథ ఎందుకు మొదలుపెట్టానా అని కె.విశ్వనాథ్‌ ఎంతో బాధపడ్డాడు. అయినప్పటికీ కష్టపడి సినిమాను పూర్తి చేశాడు. కట్‌ చేస్తే సినిమా ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌గా నిలిచిపోయింది. అప్పట్లో 5 నంది అవార్డులను సొంతం చేసుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

Exit mobile version