Home Entertainment K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకుడిగా మారకముందు జరిగిన సంఘటన ఇది. వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్‌ టాలెంట్ గుర్తించిన దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. అలా అక్కినేని నాగేశ్వరరావు చాలా సినిమాలకు కె.విశ్వనాథ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలా మూగమనసులు సినిమాకు పనిచేస్తున్న సమయంలో కె.విశ్వనాథ్ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు.

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున పాత్రలపై క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. కీలక సన్నివేశాల కోసం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో సెట్ వేశారు. ఈ క్లైమాక్స్ సీన్స్‌లో జమున వృద్ధురాలిగా కనిపించాలి. దీంతో ఆమెకు ఓల్డ్ గెటప్ వేస్తున్నారు. ఆ గెటప్ అసలు జమునకు సూట్ అయ్యిందో లేదో చూద్దామని జమున మేకప్ రూమ్‌కు కె.విశ్వనాథ్ వెళ్లాడు. ఆమెను చూసి బాగానే ఉందని అనుకుని వెనక్కి తిరిగొచ్చాడు. తిరిగి సెట్‌లోకి రాగానే పై నుంచి ఓ కట్టర్ జారి కె.విశ్వనాథ్ నెత్తిపై పడింది.

దెబ్బ గట్టిగా తగలడంతో రక్తం ధారలగా కారసాగింది. సెట్‌లో ఉన్న అక్కినేనితో పాటు సావిత్రి, జమున, ఇతర టెక్నీషియన్లు అంతా అక్కడ గుమిగూడారు. రక్తం బాగా కారడం చూసి ఏఎన్నార్ చలించిపోయాడు. వెంటనే ఆ గాయాన్ని శుభ్రం చేసి రక్తం కారకుండా ఆపారు. తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి కుట్లు వేయించుకుని తీసుకొచ్చారు. తర్వాత షూటింగ్ యథావిధిగా జరిపించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ కె.విశ్వనాథ్ రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌ – Time2news.com

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

Exit mobile version