Home Entertainment K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | కమర్షియల్ సినిమాలు తీయాలని డైరెక్టర్స్ అందరూ ఉవ్విళ్లూరుతుంటే.. కె.విశ్వనాథ్ మాత్రం కళాత్మక చిత్రాలపైనే దృష్టి పెట్టారు. హీరోలతో సంబంధం లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు. అంతెందుకు కమల్ హాసన్, చిరంజీవి వంటి నటులు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే అందులో కె.విశ్వనాథ్ పాత్ర కూడా ఉందని చెప్పొచ్చు. సాగర సంగమం, శుభ సంకల్పం, స్వాతిముత్యం వంటి సినిమాలతో కమల్ హాసన్‌లోని నటుడిని రాటుదేల్చాడు. డ్యాన్సులు, ఫైట్స్‌తో క్రేజ్ తెచ్చుకున్న చిరంజీవిలో కూడా అద్భుతమైన నటుడు ఉన్నాడని ఆపద్బాంధవుడు, స్వయంకృషి సినిమాలతో పరిచయం చేశాడు కె.విశ్వనాథ్. అలాంటి కె.విశ్వనాథ్ ఒక నటుడితో గొడవ పడ్డాడు. దాంతో తన కెరీర్‌లో ఎప్పుడూ కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు.

కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకుడు అవ్వకముందు ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణతో గాజుల కృష్ణయ్య సినిమా చేస్తున్న సమయంలో ఒకసారి ఆదుర్తి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. అదే రోజు కృష్ణతో సినిమా షూటింగ్ ఉంది. ఆరోజుల్లో కృష్ణ చాలా బిజీగా ఉండేవాడు. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవాడు. ఒక్కరోజు డేట్ మిస్సయితే దాన్ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టమైపోయేది. నెలల సమయం పోయేది. దీంతో ఎలాగైనా ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకున్నారు. దీంతో కె.విశ్వనాథ్‌ను ఆ రోజు సీన్ డైరెక్ట్ చేయమని ఆదుర్తి చెప్పాడు. దీంతో విశ్వనాథ్ సీన్ డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు.

ఆరోజు కృష్ణతో పాటు గిరిబాబు మీద కూడా షూట్ ఉంది. గిరిబాబుకు కె.విశ్వనాథ్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉండాలో కూడా వివరించాడు. అది బాగానే ఉందని గిరిబాబు కూడా ఒప్పుకున్నాడు. అయితే ముందు సీన్లలో బిహేవియర్ వేరేలా ఉందని.. ఈ సీన్‌లో వేరియేషన్ వస్తే బాగోదు కాబట్టి ఫస్ట్ చేసినట్టే చేస్తానని సమాధానమిచ్చాడు. దానికి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని షూట్ స్టార్ట్ చేశారు. షూట్ టేక్ చేసేటప్పుడు విశ్వనాథ్ చెప్పినట్టు కాకుండా ముందు సీన్లలో చేసినట్టుగానే గిరిబాబు చేశాడు. దీంతో కె.విశ్వనాథ్‌కు కోపం వచ్చింది. నేను చెప్పింది ఏంటి.. మీరు చేస్తున్నది ఏంటి? ఇలా ఎందుకు చేస్తున్నారని గిరిబాబుపై సీరియస్ అయ్యాడు. అప్పటికే గిరిబాబు స్టార్ నటుడు కాబట్టి ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో మాటలు పడటాన్ని అవమానంగా ఫీలయ్యాడు. దీంతో గిరిబాబు కూడా సీరియస్ అయ్యాడు. నేను మీకు ముందే చెప్పా కదా ఇలాగే చేస్తా అని గట్టిగా చెప్పాడు. అయినా సరే విశ్వనాథ్ వినిపించుకోలేదు. దీంతో చిన్న గొడవ జరిగింది. చివరకు కె.విశ్వనాథ్ కాంప్రమైజ్ అయ్యి సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆనాడు జరిగిన సంఘటనను మనసులో పెట్టుకున్న కె.విశ్వనాథ్ తన సినిమాల్లో ఎప్పుడూ కూడా గిరిబాబుకు అవకాశం ఇవ్వలేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌ – Time2news.com

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

Exit mobile version