Home Latest News Lionel Messi | రోనాల్డోను సమం చేసిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం.. ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా...

Lionel Messi | రోనాల్డోను సమం చేసిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం.. ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా లియోనల్ మెస్సీ

Lionel Messi | టైమ్ 2 న్యూస్, పారిస్: అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. 2022 సంవత్సరానికి గానూ ఫిఫా మెన్స్ ‘బెస్ట్ ప్లేయర్’ అవార్డును మెస్సీ చేజిక్కించుకున్నాడు. మహిళల విభాగంలో స్పెయిన్ క్రీడాకారిణి అలెక్సియా వరుసగా రెండో ఏడాది ఉత్తమ ప్లేయర్ అవార్డు కైవసం చేసుకుంది. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అర్జెంటీనాకు నాయకత్వం వహించిన మెస్సీ.. జట్టును విశ్వ విజేతా నిలిపాడు. మెగాటోర్నీ తొలి మ్యాచ్లో అనామక సౌదీ అరేబియా చేతిలో ఓడిన అర్జెంటీనా.. ఆ తర్వాత ఉత్తుంగ తరంగంలా ఎగిసింది. వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లింది. తుదిపోరులో ఫ్రాన్స్ కడవరకు పోరాడినా.. కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన అర్జెంటీనా జగజ్జేతగా అవతరించింది. ఏకపక్షంగా ముగుస్తుందనుకున్న ఫైనల్ను ఎంబాపే తన అసమాన ప్రతిభతో షూటౌట్కు తీసుకెళ్లాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్ల గోల్స్ సమం కాగా.. అనంతరం నిర్వహించిన సడెన్ డెత్లో ఆధిక్యం కనబర్చిన అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో హ్యాట్రిక్ చేసిన పిన్న వయస్కుడిగా నిలిచిన 24 ఏళ్ల ఎంబాపేకు నిరాశ తప్పలేదు.

దీంతో మూడోసారి ప్రపంచకప్ ముద్దాడిన దేశంగా అర్జెంటీనా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మెస్సీ.. సమీప ప్రత్యర్థి, ఫ్రాన్స్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబాపేను వెనక్కి నెట్టి ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు కైవసం చేసుకున్నాడు. పారిస్ వేదికగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మెస్సీ ట్రోఫీ అందుకున్నాడు. అవార్డు అందుకున్న అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాన్నాళ్ల పాటు శ్రమించిన అనంతరం నా కల (ప్రపంచ కప్ నెగ్గడం) నెరవేరింది. మొత్తానికి విశ్వవిజేతనయ్యా. నా కెరీర్లో అదే అత్యుత్తమ క్షణం. ఫుట్బాల్ ఆడటం ప్రారంభించిన ప్రతి ఆటగాడు కనే కల అది. కానీ అతి కొద్ది మంది మాత్రమే దాన్ని నిజం చేసుకోగలుగుతారు. నా ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని 35 ఏళ్ల మెస్సీ అన్నాడు. జాతీయ జట్ల కెప్టెన్లు, కోచ్లు, స్పోర్ట్స్ జర్నలిస్ట్లతో కూడిన 211 మందితో పాటు అభిమానుల ఓటింగ్తో ఈ అవార్డు విజేతను నిర్ణయించారు.

ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ ప్లేయర్లు ఎంబాపే, బెంజిమా పోటీ పడగా.. 52 పాయింట్లతో మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. ఎంబాపే 44 పాయింట్లు దక్కించుకోగా.. బెంజిమా 34 పాయింట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ ప్లేస్ల్లో నిలిచారు. మహిళల విభాగంలో అలెక్సియా వరుసగా రెండో ఏడాది ఈ పురస్కారం దక్కించుకుంది. మెస్సీ బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి కాగా.. గతంలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, పోలాండ్ ప్లేయర్ రాబర్ట్ లెవండోస్కీ కూడా రెండేసి సార్లు బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నారు. ఆధునిక ఫుట్బాల్లో దిగ్గజాలుగా ఎదిగిన మెస్సీ, రొనాల్డో ఎన్నో రికార్డులు తమ పేరిట రాసుకున్న విషయం తెలిసిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version