Home Entertainment Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Image Source : Twitter

Oscars 2023 | అనుకున్నదే నిజమైంది. అందరూ కోరుకున్నదే జరిగింది. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో నాటు నాటు సాంగ్( Naatu Naatu Song ) అకాడమీ అవార్డును గెలుచుకుంది. కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తెలుగువాళ్లకు గర్వకారణం.. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంది అంటూ ఇంగ్లిష్‌లో కీరవాణి చిన్న పాట పాడి అందర్నీ ఆకర్షించారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం ఇండియన్స్‌ను మాత్రమే కాదు విదేశీయులను సైతం ఉర్రూతలూగించింది. ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి కామన్ పీపుల్‌తో పాటు సెలబ్రెటీలు కూడా నాటు నాటు సిగ్నేచర్ స్టెప్పులు వేస్తూ యూట్యూబ్ షార్ట్స్, టిక్ టాక్ వీడియోలు చేశారు. ఇవన్నీ వైరల్‌గా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు సాంగ్‌కు వస్తున్న క్రేజ్‌ను చూసిన విదేశీయులు అవార్డులతో సత్కరిస్తూనే వస్తున్నారు. ఇప్పటికే రెండో ప్రతిష్టాత్మక సినిమా అవార్డును గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు బెస్ట్ క్రిటిక్ ఛాయిస్, హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డులను నాటు నాటు సాంగ్ అందుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం పక్కా అని అంతా అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డు ఇవ్వాలని ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాంగ్ ట్రెండ్ చేశారు. వాళ్ల ఆశ ఇప్పుడు నెరవేరింది. ఆస్కార్ అవార్డును అందుకుంది.

స్టేజిపై దుమ్మురేపిన నాటు నాటు సాంగ్

ఆస్కార్ స్టేజిపై నాటు నాటు సాంగ్ దుమ్మురేపింది. ముందుగా దీపిక పదుకుణే స్టేజిపైకి వచ్చి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వివరించింది. ఈ సినిమాలో కొమ్రం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య ఉన్న స్నేహం గురించి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చిన అథితులకు అర్థమయ్యేలా చెప్పింది. అనంతరం రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ స్టేజిపై నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పాటకు వెస్టర్న్ డ్యాన్సర్స్‌ అదరగొట్టారు. అది చూసి అక్కడ ఉన్న వారంతా కూడా ఉర్రూతలూగిపోయారు.

Read More ;

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు – Time2news.com

Exit mobile version