Home Entertainment Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ...

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అకాడమీ అవార్డును దక్కించుకుంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ : వాకండ ఫరెవర్, టాప్‌గన్ మావెరిక్ చిత్రాలతో అవతార్ సినిమా పోటీ పడింది. చివరకు విజయం సాధించింది.

పండోరా గ్రహంపైకి ఉన్న నేవీ తెగపై పరిశోధనల కోసం వెళ్లిన జేక్.. వాళ్ల మంచితనం చూసి ఆ తెగవారితో కలిసిపోతాడు. అక్కడే కథానాయికను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇదంతా అవతార్ మొదటి భాగంలో అయిపోగా.. రెండో భాగంలో కుటుంబంతో జేక్ అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఇందుకోసం నీటిని బ్యాక్‌గ్రౌండ్‌గా ఎంచుకున్నాడు జేమ్స్ కామెరూన్. నీటిలో సరికొత్త ప్రపంచాన్ని, వింతైన జంతువులు, పక్షులు, సముద్ర జీవులను సృష్టించాడు. వాటన్నింటితో కలిసి మనల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లాడు జేమ్స్‌కామెరూన్. ఈ సినిమా చూస్తున్నంతసేపు పండోరా గ్రహంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఈ సినిమాకు గట్టి పోటీ ఉన్నప్పటికీ వాటన్నిటినీ దాటుకుని ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

Read More ;

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Exit mobile version