Home Entertainment Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది...

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | ఆస్కార్ 2023 అకాడమీ అవార్డుల్లో ఇండియన్ మూవీ చిత్రం సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందా లేదా అని అంతా ఎదురుచూస్తున్న సమయంలో మరో సినిమా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకుంది. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ది ఎలిఫెంట్ విష్పరస్‌ ( The Elephant Whisperers ) ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డును నిర్మాతలు కార్తిక్ గొన్సాల్వీస్, గునీత్ మొంగా ఇద్దరూ స్టేజీపై ఈ అవార్డును అందుకున్నారు.

ఒక ఏనుగు పుట్టినప్పటి నుంచి పెరిగే విధానం తన జీవితంలో ఏం జరిగింది? మనుషులకు ప్రకృతికి ఉండే అనుబంధాన్ని హృదయాన్ని తాకేలా ది ఎలిఫెంట్ విష్పరస్ చిత్రాన్ని తెరకెక్కించారు. మనసుకు హత్తుకునేలా ఉండటంతో ఆస్కార్ అకాడమీ అవార్డును అందుకున్నాయి.

నిరాశ పరిచిన ఆల్ దట్ బ్రీత్

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఆల్ దట్ బ్రీత్ సినిమా ఫైనల్ నామినేట్ అయినప్పటికీ అవార్డు గెలుచుకోలేకపోయింది. ఈ కేటగిరీలో నవానీ చిత్రం బెస్టట్ ఫీచర్ ఫిలిం‌గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.

Read More ;

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Exit mobile version