Home Entertainment Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Oscars | సినీ ఇండస్ట్రీలోనే అత్యున్నత పురస్కారం ఆస్కార్‌. మరికొద్ది గంటల్లోనే ఈ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం కానుంది. దీంతో అందరి దృష్టి ఈ వేడుకపైనే ఉంది. చాలా ఏండ్ల తర్వాత ఒక తెలుగు సినిమా ఆస్కార్‌ బరిలో నెలవడంతో ఈసారి ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఆస్కార్‌ అవార్డు గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీలు ఈ అవార్డును అకాడమీ అవార్డ్స్ పేరుతో ప్రారంభించారు. సినీ పరిశ్రమలో ప్రతిభ కనబర్చినవారికి ఈ అవార్డు అందించేసేవారు. రానురానూ కాలక్రమంలో ఇదే అత్యున్నత పురస్కారంగా మారిపోయింది. అలాంటి ఈ ఆస్కార్ అవార్డును అమ్ముకునే పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంత వస్తుందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.

ఆస్కార్ అవార్డు చూడ్డానికి బంగారు రంగులో బంగారంతో చేసినట్టుగా ఉన్నప్పటికీ ఇది బంగారం కాదు. దీన్ని కాపర్‌తో తయారు చేస్తారు. ఆ తర్వాత దానికి బంగారపు పూత పూస్తారు. ఈ అవార్డు 30.5 అంగుళాల ఎత్తు ఉంటుంది. దీని బరువు 4 కిలోలు. ఒక్కో అవార్డు తయారీకి 400 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈ అవార్డును అమ్మితే మాత్రం కేవలం ఒక్క డాలర్‌ మాత్రమే వస్తుంది.

సినీ ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన ఆస్కార్‌ అవార్డు అమ్మితే కేవలం ఒక్క డాలర్‌ మాత్రమే వస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! అంత తక్కువ ధరతో ఈ అవార్డులను తయారు చేయడం వెనుక ఒక కారణం ఉంది. 1950కి ముందు ఓ సంఘటన జరిగింది. ఓ అమెరికన్ డైరెక్టర్ తాను గెలుచుకున్న అవార్డును వేలం వేశాడు. దానికి అప్పట్లోనే ఆరున్నర కోట్లు వచ్చాయి. అయితే ఈ విషయం తెలియడంతో ఆస్కార్‌ అకాడమీ అవార్డ్స్‌ కమిటీ చాలా బాధపడింది. దీంతో ఆస్కార్‌ అవార్డును ఎవరూ అమ్మడానికి వీల్లేకుండా నిబంధనలు ప్రవేశపెట్టింది.

ఒకవేళ ఆస్కార్ అవార్డును వేలం వేయాలంటే ఆ అధికారం కేవలం ఆస్కార్‌ అకాడమీకే ఉంటుంది. అది కూడా కేవలం ఒక్క అమెరికన్‌ డాలర్‌కు మాత్రమే వేలం వేయాల్సి ఉంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Exit mobile version