Home Latest News LPG Cylinder Price | సామాన్యులపై గుదిబండ.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్‌ ధరలు

LPG Cylinder Price | సామాన్యులపై గుదిబండ.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్‌ ధరలు

LPG Cylinder Price | సామాన్యులకు షాక్‌.. ఇప్పటికే నిత్యవసర ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజల నెత్తిన కేంద్రం మరింత భారం మోపింది. మరోసారి గ్యాస్‌ సిలిండర్‌ ధరలను భారీగా పెంచేసింది. డొమెస్టిక్‌ సిలిండర్‌పై ఒకేసారి రూ.50ను పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది జూలై నుంచి స్థిరంగా ఉన్న వంట గ్యాస్‌ ధరలు.. దాదాపు 8 నెలల తర్వాత ఇంత మొత్తంలో పెరగడం గమనార్హం. దీంతో రూ.1105గా ఉన్న గృహవినియోగ సిలిండర్‌ ధర రూ.1155కు చేరింది. కమర్షియల్‌ సిలిండర్‌ ధర కూడా భారీగా పెరిగింది. ఒక్క సిలిండర్‌పై 350 మేర పెరిగింది. పెరిగిన ఈ ధరలు నేటి ( మార్చి 1 ) నుంచే అమల్లోకి వచ్చాయి.

పెరిగిన ధరలతో ఢిల్లీలో రూ.1053 గా ఉన్న డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.1103కు చేరింది. కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1769 నుంచి రూ.2119కు పెరిగింది. కోల్‌కతాలో రూ.1870 నుంచి రూ.2221కు పెరిగింది. ముంబైలో రూ.2071, చెన్నైలో రూ.2268కి చేరింది.

Exit mobile version