Home Entertainment Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscar 2023 | ప్రతిష్ఠాత్మక ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా కొనసాగుతోంది. అమెరికాలోని లాస్‌ఏంజిలెస్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ ఆస్కార్ స్టేజిపై పాట పాడుతూ ఉంటే.. వెస్టర్న్ డ్యాన్సర్స్ అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది చూసి అక్కడి వాళ్లంతా ఉర్రూతలూగిపోయిరు. ఇక అవార్డుల విషయానికొస్తే బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం కేటగిరితో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మొదలు పెట్టారు. గులెర్మో డెల్ టోరో తెరకెక్కించిన పినాషియో ఉత్తమ యానిమేటెడ్ మూవీగా ఎంపికైంది.

ఆస్కార్ అవార్డుల విజేతలు వీళ్లే..

  • బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – జెమిలీ కర్జీస్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ )
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – కే హ్యూ క్యాన్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ )
  • బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం – పినాషియో
  • బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం – నవల్నీ
  • బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ – ఏన్ ఐరిష్ గుడ్‌బై
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ -జేమ్స్ ఫ్రెండ్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ )
  • బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైల్ – ది వేల్
  • బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – రూత్ కార్టర్ ( బ్లాక్ పాంథర్ : వకండా ఫరెవర్ )
  • బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం – ది ఎలిఫెంట్ విష్పరస్
  • బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం – ది బాయ్, ది మోల్, ది ఫాక్స్, అండ్ ది హార్స్
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ మూవీ – అవతార్ : ది వే ఆఫ్ వాటర్
  • బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్
  • బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – ఉమెన్ టాకింగ్
  • బెస్ట్ సౌండ్ – టాప్‌గన్ : మావెరిక్
  • బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – నాటు నాటు (ఆర్ఆర్ఆర్ )
  • బెస్ట్ ఎడిటింగ్ – ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • బెస్ట్ మూవీ – ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్
  • బెస్ట్ డైరెక్టర్ – డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెట్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ )
  • బెస్ట్ యాక్టర్ – బ్రెండాన్ ఫాసర్ ( ది వేల్ )
  • బెస్ట్ యాక్ట్రెస్ – మిచెల్ యో ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ )

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version