Saturday, May 4, 2024
- Advertisment -
HomeLatest NewsAustralian Open | ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నుంచి నాదల్‌ ఔట్‌.. జొకోవిచ్‌కు రూట్‌...

Australian Open | ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నుంచి నాదల్‌ ఔట్‌.. జొకోవిచ్‌కు రూట్‌ క్లియర్‌

Australian Open | టైమ్‌ టు న్యూస్‌, మెల్‌బోర్న్‌: పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఖాతాలో వేసుకున్న రఫేల్‌ నాదల్‌.. సీజన్‌ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి నిష్క్రమించాడు. ఇప్పటికే 22 గ్రాండ్‌స్లామ్స్‌ ఖాతాలో వేసుకున్న నాదల్‌.. గాయం కారణంగా రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో నాదల్‌ 4-6, 4-6, 5-7తో మెకంజీ మెక్‌ డోనాల్డ్‌ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. గాయం ఇబ్బంది పెడుతుండటంతో తొలి రౌండ్‌ నుంచే ప్రపంచ రెండో ర్యాంకర్‌ నాదల్‌ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీన్ని అవకాశంగా మలుచుకున్న మెకంజీ వరుస సెట్లలో విజయం సాధించాడు. రెండో సెట్‌ మధ్యలో గాయపడ్డ నాదల్‌.. వైద్య చికిత్స అనంతరం ఆట కొనసాగించాడు.

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన నాదల్‌ బాధతో విలవిల్లాడుతూ ఉంటే.. స్టాండ్స్‌లోనే ఉన్న అతడి భార్య కన్నీటి పర్యంతమైంది. మూడో సెట్‌లో తుదికంటా పోరాడిన నాదల్‌ గెలుపు గీత దాటలేకపోయాడు. 2016 ఆస్ట్రేలియా ఓపెన్‌ తొలి రౌండ్‌ ఓటమి అనంతరం ఓ గ్రాండ్‌స్లామ్‌లో నాదల్‌ ఇంత త్వరగా నిష్క్రమించడం ఇదే తొలిసారి. స్పెయిన్‌ బుల్‌ ఇంటిదారి పట్టడంతో సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ టైటిల్‌ మార్గం సుగమమైంది.

జొకోవిచ్‌ జోరు

నాదల్‌ అత్యధిక టైటిల్స్‌ రికార్డును అధిగమించాలని ఉవ్విళ్లూరుతున్న నాలుగో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. ఆ దిశగా మరో ముందడుగు వేశాడు. తొలి రౌండ్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన జొకో.. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 6-1, 6-7 (5/7), 6-2, 6-0తో కొకాడ్‌పై విజయం సాధించాడు. తొలి సెట్‌తో పాటు చివరి రెండు సెట్‌లను అలవోకగా చేజిక్కించుకున్న జొకోవిచ్‌.. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు.

రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదికగా జరిగిన పోరులో జొకోవిచ్‌ 9 ఏస్‌లతో విజృంభించాడు. 21 బ్రేక్‌ పాయింట్లలో ఏడింటిని కాచుకున్న నొవాక్‌.. 145 పాయింట్లు నెగ్గి.. మూడోరౌండ్‌లో అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో అగట్‌, దిమిత్రివ్‌, రూబ్లెవ్‌ విజయాలు సాధించగా.. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, స్వార్ట్జ్‌మన్‌ పరాజయాలతో ఇంటిదారి పట్టారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Uppal Match | హోంగ్రౌండ్‌లో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.. గల్లీబాయ్‌కు అండగా రోహిత్‌ శర్మ

Junior NTR | యంగ్‌ టైగర్‌ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!

UPPAL STADIUM | ఉప్పల్‌ ఉప్పొంగేనా.. రేపు భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే

Hockey World Cup 2023 | హాకీ వరల్డ్ కప్‌లో భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News