Junior NTR | హైదరాబాద్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ బుధవారం ఆరంభం కానుంది. దీనిలో భాగంగా ఈ మ్యాచ్ ఆడేందుకు భారత్- న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. సాధన కూడా మొదలు పెట్టేశాయి. మ్యాచ్ కి ఇంకా సమయం ఉండటంతో భారత ప్లేయర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిశారు.
నగరంలో ఖరీదైన కార్ కలెక్షన్స్ తో ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ ఇంట్లో భారత క్రికెటర్లు , జూనియర్ ఎన్టీఆర్ ని కలుసుకున్నారు. ఎన్టీఆర్ తో ఎవరికి వారే ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. భారత ప్లేయర్స్ సూర్య కుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ , ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చహల్, శార్దూల్ ఠాకూర్ లు యంగ్ టైగర్ తో సరదాగా ముచ్చటించారు.
దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సూర్య కుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టి ఎన్టీఆర్ తో కలిసి తీయించుకున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అందుకోవడం పై చిత్ర యూనిట్ కు సూర్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశాడు.

అటు క్రికెట్ అభిమానులు, ఎన్టీఆర్ ఫాన్స్ ఈ ఫోటోలను చూసి తెగ మురిసిపోతున్నారు. ఇయర్ ఎండ్ ట్రిప్ పేరిట భార్య ప్రణతి, కుమారులతో కలిసి అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ సందర్భంగా కూడా కొందరు భారత ప్లేయర్స్.. రామ్ చరణ్, చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
UPPAL STADIUM | ఉప్పల్ ఉప్పొంగేనా.. రేపు భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే
Hockey World Cup 2023 | హాకీ వరల్డ్ కప్‌లో భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా
Hockey World Cup | ఆరంభం అదుర్స్.. స్పెయిన్‌పై భారత్ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్
Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు