Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentVijay Antony | బిచ్చగాడు హీరో పరిస్థితి విషమం అంటూ వార్తలు.. క్లారిటీ ఇదీ

Vijay Antony | బిచ్చగాడు హీరో పరిస్థితి విషమం అంటూ వార్తలు.. క్లారిటీ ఇదీ

Vijay Antony | బిచ్చగాడు హీరో విజయ్‌ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం మలేసియాలో బిచ్చగాడు 2 షూటింగ్‌ సమయంలో జరిగిన యాక్సిడెంట్‌లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ను కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇవ్వకపోవడంతో రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నాయి.

బోటు నడిపే సీన్స్‌ షూట్‌ చేస్తుండగా విజయ్‌ ఆంటోనీ ఉన్న పడవ.. చిత్ర యూనిట్‌ ఉన్న పడవను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో విజయ్‌ ఆంటోనీ పళ్లు, దవడ ఎముకలు విరిగిపోయాయని, మొహానికి కూడా బలంగా దెబ్బలు తాకాయని వార్తలు వచ్చాయి. ఇంకా విజయ్‌ ఆంటోనీ అపస్మారక స్థితిలోనే ఉన్నాడని ప్రచారం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతోనే మలేసియా నుంచి చెన్నై తరలించి చికిత్స అందిస్తున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా వదంతులు ఎక్కువ కావడంతో విజయ్‌ ఆంటోనీ కుటుంబసభ్యులు స్పందించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. నడుముకి మాత్రమే తేలికపాటి దెబ్బ తగిలిందని స్పష్టం చేశారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ప్రస్తుతం కోలుకుంటున్నారని, త్వరలోనే సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న విజయ్‌ ఫ్యాన్స్‌ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

DCW chief Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కే రక్షణ లేదు.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి?

comedian vadivelu | కమెడియన్ వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం

Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 9 మంది మృతి

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News