Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsUPPAL STADIUM | ఉప్పల్‌ ఉప్పొంగేనా.. రేపు భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే

UPPAL STADIUM | ఉప్పల్‌ ఉప్పొంగేనా.. రేపు భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే

UPPAL STADIUM | టైమ్‌ టు న్యూస్‌, హైదరాబాద్‌: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. తమ అభిమాన ఆటగాళ్లు కండ్లముందు కనికట్టు చేస్తుంటే చూసి మురిసిపోయేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. దాదాపు నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ జరుగనుండగా.. ఇప్పటికే టికెట్లు హాట్‌ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో జరుగనున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో.. ఈ సిరీస్‌ తమకు కీలకమని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ పేర్కొనగా.. భారత మిడిలార్డర్‌ ఆటగాడు శ్రేయస అయ్యర్‌ గాయం కారణంగా కివీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు.

ఉప్పల్‌ పిచ్‌ స్పిన్నర్లతో పాటు బ్యాటర్లకు సహకరించనున్న నేపథ్యంలో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా శ్రీలంకపై సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసి టీమ్‌ఇండియా జోరు మీదుంటే.. పాకిస్థాన్‌ను వారి స్వదేశంలో ఓడించిన న్యూజిలాండ్‌ అదే ఊపులో భారత్‌ పనిపట్టాలని చూస్తోంది.

శ్రేయస్‌ దూరం

మిడిలార్డర్‌లో కీలక భాగస్వామ్యాలు నిర్మిస్తూ.. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌.. వెన్ను నొప్పి కారణంగా సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అయ్యర్‌ స్థానంలో రజత్‌ పాటిదార్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు పేర్కొంది. చికిత్స కోసం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు వెళ్తాడని వెల్లడించింది. దీంతో తుది జట్టులో సూర్యకుమార్‌ ఆడటం ఖాయమైనట్లే.

ఇక మరోవైపు వ్యక్తిగత కారణాలతో లోకేశ్‌ రాహుల్‌ ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో.. వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ బరిలోకి దిగనున్నాడు. ఇటీవల వన్డేల్లో వేగవంతమైన డబుల్‌ సెంచరీ నమోదు చేసి మంచి జోష్‌లో ఉన్న ఇషాన్‌ ఓపెనర్‌గా కాకుండా.. రాహుల్‌ ఆడే ఐదో స్థానంలోనే బరిలోకి దిగే చాన్స్‌ ఉంది. రోహిత్‌, గిల్‌ ఓపెనింగ్‌ చేయనుండగా.. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా సుందర్‌ బ్యాటింగ్‌కు రానున్నారు. బౌలింగ్‌లో హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ మరోసారి కీలకం కానున్నాడు. సొంతగడ్డపై ఆడుతున్న తొలి వన్డేలో సిరాజ్‌ సత్తాచాటాలని తహతహలాడుతున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hockey World Cup 2023 | హాకీ వరల్డ్ కప్‌లో భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

India Vs Sri Lanka | శ్రీలంక ఘోర పరాజయం.. 317 పరుగుల తేడాతో భారత్ రికార్డు విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

Hockey World Cup | ఆరంభం అదుర్స్‌.. స్పెయిన్‌పై భారత్‌ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్‌

Amartya Sen | బీజేపీకి ఎదురులేదు అనుకోవద్దు.. 2024లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర.. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు

Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News