Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentJacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న...

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Jacqueline Fernandez | కొంతకాలంగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. సుఖేశ్ మనీలాండరింగ్ కేసు బయటపడ్డప్పటి నుంచి తరచూ ఆమె వార్తల్లో నిలుస్తుంది. సుఖేశ్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలతో పాటు.. ఆమె వ్యక్తిగత విషయాలు ఎన్నో బయటపడ్డాయి. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్.. సుఖేశ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పాటియాలా కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో అనేక విషయాలు బయటపెట్టింది. సుఖేశ్ ఓ మోసగాడు అని.. అతని వల్ల నయవంచనకు గురయ్యానని ఆవేదన వ్యక్తంచేసింది. సుఖేశ్ తన కెరీర్‌ను నాశనం చేశాడని.. అతని వల్ల తన జీవితం నరకంలో పడినట్టు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది.

తను ఓ ప్రభుత్వ అధికారిని అంటూ సుఖేశ్ మొదట్లో పరిచయం చేసుకున్నాడని.. కానీ అతనిపై అనుమానం వచ్చిందని తెలిపింది. కానీ సుఖేశ్ హోం మంత్రిత్వ శాఖలో కీలక అధికారి అని తన మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముతిలాల్‌‌ను పింకీ ఇరానీ అనే మహిళ నమ్మించిందని పేర్కొంది. అలా మేకప్ ఆర్టిస్ట్ ద్వారా తనతో సుఖేశ్ పరిచయం పెంచుకున్నాడని చెప్పింది. తను సన్ టీవీ యజమాని అని.. తమిళనాడు మాజీ సీఎం జయలలిత తనకు ఆంటీ అవుతుందని చెప్పాడని కూడా పేర్కొంది. తాము ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నామని.. నాతో సౌత్‌లో సినిమా చేస్తానని కూడా అన్నాడని తెలిపింది. రోజూ షూటింగ్‌కు వెళ్లేముందు, వెళ్లిన తర్వాత, రాత్రి పడుకునే ముందు వీడియో కాల్స్ చేసేవాడని వాంగ్మూలంలో పేర్కొంది. జైలులో ఉండి కూడా తనతో కాల్స్ మాట్లాడేవాడని.. కానీ ఎప్పుడూ జైలులో ఉన్న విషయాన్ని బయటపెట్టలేదని తెలిపింది. సోఫాలో కూర్చొని మాట్లాడటంతో తనకు కూడా అనుమానం రాలేదని చెప్పింది. చివరిసారిగా సుఖేశ్ తనతో ఆగస్టు 8న ఫోన్‌లో మాట్లాడాడని.. ఆ తర్వాతే అతను తర్వాత అరెస్ట్ అయిన విషయం తెలిసిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నుంచి సుఖేశ్‌ను కాంటాక్ట్ అవ్వలేదని తెలిపింది.

సుఖేశ్ గురించి పింకీకి పూర్తిగా తెలుసని.. కానీ ఎప్పుడూ తనతో ఆ విషయాలు చెప్పలేదని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆవేదన వ్యక్తం చేసింది. తనను మోసం చేయాలనే ఉద్దేశంతో కావాలనే పింకీ.. సుఖేశ్‌కు పరిచయం చేసిందని వెల్లడించింది. అతని క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి బయటపడేదాకా తన పేరు సుఖేశ్ అని తనకు తెలియదని చెప్పింది. తనపై అనుమానం రాకుండా సుఖేశ్ జాగ్రత్త పడేవాడని వాంగ్మూలంలో పేర్కొంది. కేరళ వెళ్లినప్పుడు ఓ ప్రైవేటు జెట్, హెలికాప్టర్ రెడీ చేశాడని పేర్కొంది. సుఖేశ్‌ను కలిసేందుకు అతని ప్రత్యేక విమానంలోనే రెండుసార్లు చెన్నై వెళ్లినట్టు తెలిపింది.

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నోరా ఫతేహి కూడా సుఖేశ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తన గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే పెద్ద బంగ్లా, లగ్జరీ జీవితం అందిస్తానని ఆశచూపాడని న్యాయస్థానానికి చెప్పింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News