Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsDCW chief Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కే రక్షణ లేదు.. ఇక...

DCW chief Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కే రక్షణ లేదు.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి?

DCW chief Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ కి గత రాత్రి ఓ అనుకొని సంఘటన ఎదురైంది. నగరంలో మహిళల రక్షణ ఎలా ఉందో తెలుసుకునేందుకు వెళ్లిన ఆమెకు ఓ కారు డ్రైవర్‌ చేతిలో దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది. ఈ విషయాన్ని స్వయంగా స్వాతి నే ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మహిళల సంరక్షణ విషయాలను పరిశీలించే క్రమంలో ఓ కారు డ్రైవర్‌ తనను వేధింపులకు గురి చేశాడని, అతడిని గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కారు అద్దాలు లాక్‌ చేసేసి 10-15 మీటర్ల దూరం కారుతోనే లాక్కెళ్లాడని స్వాతి మలివాల్‌ ట్వీట్‌ చేశారు. దేవుడి దయ నా మీద ఉండటం వల్లే ఇప్పుడు నేను బతికి ఉన్నానని ఆమె పేర్కొన్నారు.

రాజధాని నగరంలో సాక్షాత్తు మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ కే రక్షణ కరువైతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని స్వాతి ట్విటర్‌ ద్వారా ప్రశ్నలు కురిపించారు. తన పై వేధింపులకు పాల్పడడంతో పాటు కారుతో లాక్కెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని ఆమె తెలిపారు.

ఈ ఘటన గురించి పోలీసులు స్పందించారు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత 3 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ 2 వ గేటు వద్ద ఉన్న పుట్‌ పాత్‌ పై నిలబడిన స్వాతి మలివాల్‌ తన టీమ్‌ తో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఆ కారు డ్రైవర్‌ను హరీశ్‌ చంద్రగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఘటనా సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని.. అతడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించడం జరిగిందన్నారు. నిందితుడు స్వాతి మలివాల్‌ ని కారు ఎక్కాల్సిందిగా అడిగాడు.. అతడిని పట్టుకునేందుకు ఆమె ప్రయత్నించగా కారు అద్దాలు పైకి ఎత్తి లాక్‌ చేయడంతో పాటు కారుతో లాక్కెళ్లాడని పోలీసులు వివరించారు.

ప్రస్తుతం హరీశ్‌ చంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు బాధితురాలు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌కి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

comedian vadivelu | కమెడియన్ వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం

Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 9 మంది మృతి

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News