Home Latest News WT20 World Cup 2023 | విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం

WT20 World Cup 2023 | విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం

WT20 World Cup 2023 | టైమ్ 2 న్యూస్, కేప్‌టౌన్: ఆస్ట్రేలియా అదరగొట్టింది. ప్రపంచంలో మరే జట్టుకూ సాధ్యంకాని రీతిలో ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. టోర్నీలో అపజయమన్నదే ఎరుగని ఆసీస్.. ఆదివారం జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. ఆస్ట్రేలియాకు ఇది ‘హ్యాట్రిక్’ టైటిల్ కావడం మరో విశేషం. 2018, 2020లోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్), అజేయ అర్ధశతకంతో అలరించగా.. గార్డ్నర్ (29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అలీసా హీలీ (18; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నమ్ ఇస్మాయిల్, మరీనే కాప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. లారా వాల్వార్ట్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టినా.. తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో దక్షిణాఫ్రికాకు పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మేగన్ షుట్, గార్డ్నర్, బ్రౌన్, జెస్ తలా ఒక వికెట్ పడగొట్టారు. బెత్ మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, గార్డ్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ వేదికగా తదుపరి మహిళల టీ20 ప్రంపచకప్ జరుగనుంది.

ఎదురులేని కంగారూలు..

మహిళల విభాగంలో తొలిసారి (2009) నిర్వహించిన టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్ చాంపియన్గా నిలువగా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు (2010, 2012, 2014లో) ఆస్ట్రేలియా కప్పు చేజిక్కించుకొని హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. 2016లో భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో వెస్టిండీస్ నయా చాంపియన్‌గా అవతరించగా.. అప్పటి నుంచి వరుసగా మూడోసారి (2018, 2020, 2023లో) ఆస్ట్రేలియా ట్రోఫీ చేజిక్కించుకొని డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. 2020 మెగాటోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు.. ఈసారి సెమీఫైనల్లోనూ కంగారూల చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం.. ఒత్తిడిని దరిచేరనివ్వకపోవడం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటమిని అంగీకరించకపోవడం వంటి లక్షణాలతో ఆసీస్ మహిళల క్రికెట్‌ను ఏలుతున్నది. ప్రస్తుత మెగాటోర్నీనే తీసుకుంటే.. భారత్తో జరిగిన సెమీఫైనల్లో తప్ప ఆ జట్టుకు పెద్దగా ప్రతిఘటన ఎదురువలేదనే చెప్పాలి. సెమీస్లో ఒక దశలో టీమ్ఇండియా విజయం ఖాయం అనిపించినా.. ఏమాత్రం తగ్గని ఆసీస్ చివరి వరకు పోరాటం సాగించి సఫలమైంది. తుదిపోరులో టాస్ గెలువడంతోనే సగం మ్యాచ్ గెలిచేసిన కంగారూలు.. బరిలోకి దిగాక మిగిలిన పని పూర్తి చేశారు. బిగ్ మ్యాచ్ ప్లేయర్గా ముద్రపడ్డ మూనీ అదిరిపోయే ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. గార్డ్నర్ ఆల్రౌండ్ మెరుపులు మెరిపించింది.

2-మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం.
6-మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ట్రోఫీ. 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version