Home Latest News Youtube | యూట్యూబ్‌లో ఏ వీడియో అయినా మీకు నచ్చిన భాషలో చూసేయండి.. సరికొత్త ఫీచర్

Youtube | యూట్యూబ్‌లో ఏ వీడియో అయినా మీకు నచ్చిన భాషలో చూసేయండి.. సరికొత్త ఫీచర్

Image by natanaelginting on Freepik

Youtube | జియో వచ్చిన తర్వాత మొబైల్ వినియోగం పెరిగిపోయింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో వినియోగం ఎక్కువైపోయిపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా వీడియోలు, షార్ట్స్ అంటూ ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. కరోనా, లాక్‌డౌన్ పుణ్యమా అని తెలుగులోనే కాకుండా మిగతా భాషల సినిమాలు వీడియోలను కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. అయితే పరాయి భాషల్లో వీడియోలు చూసినప్పుడు బాగానే అనిపించినా.. వాటి అర్థం తెలియక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు యూట్యూబ్ ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది.

ఇతర భాషల్లోని వీడియోలను మనకు నచ్చిన భాషలో చూసేందుకు వీలుగా మల్టీ లాంగ్వేజ్‌ ఫీచర్‌ అనే కొత్త విధానాన్ని యూట్యూబ్ తీసుకొస్తుంది. దీని ద్వారా ఇతర భాషల వీడియోలను కూడా మన భాషలోకి మార్చుకుని చూడవచ్చు. ఇందుకోసం వీడియో ప్లే అయ్యేటప్పుడు కనిపించే సెట్టింగ్స్‌లోని ఆడియో ట్రాక్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మనకు నచ్చిన భాషను ఎంచుకోవడం ద్వారా డబ్బింగ్ వెర్షన్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇలా తమ ప్లాట్‌ఫామ్‌లోని వీడియోలకు మల్టీ లాంగ్వేజ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రేక్షకులకు మాత్రమే కాదు కంటెంట్ క్రియేటర్స్‌కు కూడా చాలా మేలు జరుగుతుంది. తాము అప్‌లోడ్ చేసిన వీడియోలను తమ భాష పరిధిలోని వాళ్లు మాత్రమే కాకుండా ఇతర భాషల వాళ్లకు కూడా చేరువవుతాయి.

Exit mobile version