Home News International Pakistan financial crises | అమెరికాలో ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్‌.. బిడ్‌ దాఖలు...

Pakistan financial crises | అమెరికాలో ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్‌.. బిడ్‌ దాఖలు చేసిన భారతీయుడు

Representational Image

Pakistan financial crises | అమెరికాలోని ఎంబసీ కార్యాలయం ఆస్తులను పాకిస్తాన్‌ అమ్మకానికి పెట్టింది. అందేంటి ఎంబసీ కార్యాలయం ఆస్తులు అమ్మడం దేనికి అని ఆలోచిస్తున్నారా? పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలే ఇందుకు కారణమట. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అందిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోందట పాకిస్థాన్‌.

ఇప్పటికే ప్రభుత్వ అధికారుల వాహనాల్లో కోత పెట్టేసింది. ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను కూడా విక్రయించింది. సౌదీ అరేబియా నుంచి ఆశించినంత ఆర్థిక సాయం అందకపోవడంతో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా పోయాయట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్తులను అమ్ముకునేందుకు సిద్ధపడుతోంది పాకిస్తాన్‌. ఇందులో భాగంగా వాషింగ్టన్‌లోని పాకిస్తాన్‌ రాయబార కార్యాలయంలోని రక్షణ విభాగం ఉన్న భవనాన్ని అమ్మకానికి పెట్టింది. బిడ్లు కూడా ఆహ్వానించగా.. జెవీష్‌ గ్రూప్‌ 6.8 మిలియన్‌ డాలర్లకు కొనేందుకు సిద్ధపడింది. బిడ్లలో అత్యధికంగా ధర ఈ సంస్థే కోట్‌ చేసిందట.

జెవీష్‌ గ్రూప్‌ ఈ భవనాన్ని కొనేందుకు ప్రత్యేకంగా కారణం కూడా ఉందని పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక పేర్కొంది. ఈ భవనం స్థానంలో యూదుల ప్రార్థనా మందిరాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన రియల్టర్‌ కూడా పోటీపడ్డారట. ఆయన 5 మిలియన్‌ డాలర్లకు బిడ్‌ కోట్‌ చేయడం గమనార్హం. ఒక్క ఈ బిల్డింగ్‌నే కాదు.. న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్‌ హోటల్‌ స్థలాన్ని కూడా లీజుకు ఇవ్వాలని, లేదా విక్రయించాలని పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం కూడా తీసేసుకున్నారట.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cancer | భయపెడుతున్న ఊపిరితిత్తుల కేన్సర్లు .. ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం

Corona nasal spray | నాజల్ స్ప్రే వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్.. ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్ కోసం అంత చెల్లించాల్సిందే

Corona | చైనాలోని ఆ ఒక్క నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు.. చేతులెత్తేసిన అధికారులు

Postpartum Hair loss | డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతుందా? ఈ టిప్స్‌ మీకోసమే..

Exit mobile version