Home Lifestyle Health Cancer | భయపెడుతున్న ఊపిరితిత్తుల కేన్సర్లు .. ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం

Cancer | భయపెడుతున్న ఊపిరితిత్తుల కేన్సర్లు .. ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం

Pic Credit: Freepik

Cancer | మీరు ధూమపానానికి అడిక్టయ్యారా ? విపరీతమైన దగ్గు వస్తుందా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? చాతిలో నొప్పి వస్తుందా? బరువు తగ్గినట్లు అనిపిస్తుందా? తరచూ తలనొప్పి వస్తుందా ? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే.. పొగతాగేవాళ్లు ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల కేన్సర్‌ కేసులు భారీగా పెరుగుతున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన రెండేళ్లలో ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న వాళ్ల సంఖ్య 5 శాతం పెరిగిందని పార్లమెంట్‌ వేదికగా వెల్లడించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రీసెర్చ్‌ (ICMR), నేషనల్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ ప్రొగ్రాం డేటాకు సంబంధించిన వివరాలను పార్లమెంట్‌ ముందుంచింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఏడాది ఊపిరితిత్తుల కేన్సర్‌ వల్ల 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఊపిరితిత్తుల కేన్సర్‌ బాధితులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది తీసుకున్న లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 2లక్షలకు పైగా ఊపిరితిత్తుల కేన్సర్‌ కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. ఈ జాబితాలో 1.21 లక్షల కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 1.12 లక్షల కేసులతో పశ్చిమ బెంగాల్‌, 1.09 లక్షల కేసులతో బిహార్‌ మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే మాత్రం తమిళనాడు 93 వేల కేసులతో మొదటి స్థానంలో ఉంది. కర్నాటకలో 90 వేలు, ఏపీలో 73 వేలు, కేరళలో 59 వేల కేసులున్నాయి. గత మూడేళ్లలో చూసుకుంటే తెలంగాణలోనే అతి తక్కువ కేసులు నమోదయ్యాయి.

2025 నాటికి ఊపిరితిత్తుల కేన్సర్‌ బాధితులు భారీ పెరిగే అవకాశం ఉందని నివేదిక బయటపెట్టింది. దేశంలో ప్రతి పది మందిలో ఒకరు ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడే అవకాశం ఉందని ఐసీఎంఆర్‌ పేర్కొంది. మరో మూడేళ్లలో కేసుల సంఖ్య 12.8 శాతానికి పెరిగే ఛాన్సు ఉందన్నది. ముఖ్యంగా పురషుల్లో ఊపిరితిత్తుల కేన్సర్లు, మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు.

Exit mobile version