Home News AP Bomb Cyclone | అమెరికాలో ముగ్గురు తెలుగు వాళ్లను బలిగొన్న బాంబ్ సైక్లోన్‌.. భార్యాభర్త మృతి,...

Bomb Cyclone | అమెరికాలో ముగ్గురు తెలుగు వాళ్లను బలిగొన్న బాంబ్ సైక్లోన్‌.. భార్యాభర్త మృతి, వాళ్లను కాపాడబోయి మరొకరు..

Bomb Cyclone | అగ్రరాజ్యంలో దారుణంగా జరిగింది. క్రిస్మస్ సెలవుల్లో విహారయాత్రకు వెళ్లిన తెలుగు జంటను బాంబ్ సైక్లోన్ బలిగొంది. ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. వీరిని కాపాడబోయిన మరొక తెలుగు వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అరిజోనాలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నారాయణ దంపతులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు బయటకు వెళ్లారు. వీరితో పాటు మరో రెండు తెలుగు కుటుంబాలు కూడా విహారయాత్రకు వెళ్లాయి. అయితే మార్గం మధ్యలో ఉన్న సరస్సు గడ్డకట్టుకుపోవడం చూసి అక్కడ ఫొటోలు దిగాలని భావించారు. ముందుగా నారాయణ చిన్న కూతురు గడ్డకట్టుకుపోయిన సరస్సుపైకి వెళ్లింది ఆ తర్వాత నారాయణ, ఆయన భార్య కూడా వెళ్లారు. ఈ సమయంలోనే మంచు విరిగి ముగ్గురూ సరస్సులో పడిపోయారు. వీరిని కాపాడేందుకు విశాఖకు చెందిన మేడిశెట్టి గోకుల్ కూడా సరస్సులోకి వెళ్లాడు. నారాయణ చిన్న కూతురును కాపాడగలిగారు. కానీ నారాయణ దంపతులు, గోకుల్ ముగ్గురు సరస్సులో పడి చనిపోయారు.

పెదనందిపాడుకు చెందిన ముద్దన సుబ్బారావు కుమారుడు ముద్దన నారాయణకు అన్నపర్రు గ్రామానికి చెందిన హరితతో 2010లో వివాహం జరిగింది. 2012లో ఉద్యోగరిత్యా నారాయణ మలేషియా వెళ్లారు. 2016లో అమెరికాలో వెళ్లి స్థిరపడ్డారు. అయితే క్రిస్మస్ సందర్భంగా ఫినిక్స్ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లి నారాయణ దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్రకు వెళ్లే ముందు నారాయణ పాలపర్రులోని తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

అమెరికాలో బాంబ్ సైక్లోన్ కారణంగా కనివినీ ఎరుగని రీతిలో మంచు కురుస్తోంది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అమెరికాలోని సగం రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 48 డిగ్రీలకు పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలల్లో విమానాలు రద్దయ్యాయి. బాంబ్ సైక్లోన్ కారణంగా 63 మంది మృతి చెందారు. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Cancer | భయపెడుతున్న ఊపిరితిత్తుల కేన్సర్లు .. ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం

Bomb cyclone | క్రిస్మస్ వేళ అంధకారంలో అమెరికా.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

Exit mobile version