Home Lifestyle Health Postpartum Hair loss | డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతుందా? ఈ టిప్స్‌ మీకోసమే..

Postpartum Hair loss | డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతుందా? ఈ టిప్స్‌ మీకోసమే..

Image by Freepik

Postpartum Hair loss | మహిళలు గర్భం దాల్చిన తర్వాత వారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఒక బిడ్డకు జన్మనివ్వడం కోసం కావాల్సినట్టుగా తన శరీరాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలో హార్మోన్లల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల బరువు పెరగడం, కాళ్ల వాపులు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీటితో పాటు జుట్టు కూడా విపరీతంగా ఊడిపోతుంది. ఇది మహిళల్లో కామన్‌గా కనిపించే సమస్యే. కానీ ఎలా ఎందుకు జుట్టు రాలిపోతుంది? దీన్ని ఎలా నివారించుకోవాలి? ఈ విషయాలు ఎప్పుడు తెలుసుకుందాం..

ఇదే కారణం

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో వెంట్రుకలు దట్టంగా ఉండి నిగనిగలాడుతుంటాయి. కానీ డెలివరీ కాగానే బాడీలోని ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ తగ్గుతుంటాయి. దీనివల్ల వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇది డెలివరీ తర్వాత అందరిలో కామన్‌గా కనిపించే సమస్య కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మళ్లీ అంత సెట్‌ అయిపోతుంది. అయినా సరే హెయిర్‌ ఫాల్‌ సమస్య తొందరగా తగ్గాలంటే ఆహారపు అలవాట్లలో పలు మార్పులు చేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు కొన్ని టిప్స్‌ పాటించవచ్చు.

ఎక్కువగా నిద్రపోవాలి

డెలివరీ తర్వాత ఒత్తిడి, నిద్ర, విశ్రాంతి లేకపోయినా కూడా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి ఎక్కువ సేపు నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయాలి.

పోషకాహారం తీసుకోవాలి

జుట్టు రాలడం తగ్గించేందుకు విటమిన్స్‌, పోషకాలు ఉండే ఆకుకూరలు, చిలగడ దుంపలు, తాజా పండ్లు ఎక్కువగా తినాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బయోటిన్‌ ఎక్కువగా ఉండే గుడ్లు, పెరుగు, బాదం, నట్స్‌, చిక్కుళ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. లేదంటే బయోటిన్‌ ఉండే బీకాంప్లెక్స్‌ సప్లిమెంట్స్‌ కూడా తీసుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి

➣ వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలి. తక్కువ రసాయనిక గాఢత కలిగిన షాంపూలనే వాడాలి. కండీషనర్లు కూడా వాడవచ్చు.

➣ తలస్నానానికి మరీ వేడి నీటిని ఉపయోగించవద్దు. చల్లటి నీళ్లు లేదా గోరు వెచ్చటి నీటిని మాత్రమే వాడాలి.

➣ జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు. వెంట్రుకలు మొత్తం ఆరేవరకు ఆగాలి. రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ ట్రై చేయడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంది.

➣ రెగ్యులర్‌గా ఆయిల్‌ మసాజ్‌ చేయడం ద్వారా కూడా వెంట్రుకలు పెరుగుతాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Stretch marks after pregnancy | డెలివరీ తర్వాత పొట్టపై మచ్చలు అలాగే ఉంటున్నాయా?

Hair fall | రాత్రి పూట తలస్నానం చేస్తున్నారా? బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త

Eyestrain | ఫోన్లను ఎక్కువసేపు చూసినప్పుడు కళ్లు మండుతున్నాయా?

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Bath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

Exit mobile version