Home Lifestyle Health Corona nasal spray | నాజల్ స్ప్రే వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్.. ప్రైవేటు...

Corona nasal spray | నాజల్ స్ప్రే వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్.. ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్ కోసం అంత చెల్లించాల్సిందే

Corona nasal spray | ముక్కు ద్వారా అందించే కరోనా వ్యాక్సిన్‌ను త్వరలోనే ప్రైవేటులో అందుబాటులోకి తీసుకురానున్నట్టు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. సింగిల్ డోస్ టీకా ధరను రూ.800గా నిర్ణయించింది. దీనికి పన్నులు అదనంగా ఉంటాయని పేర్కొంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం దీన్ని రూ.320కే ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇంకోవాక్ (iNCOVACC ) అని పిలవబడే ఈ నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌ కొవిన్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. జనవరి నాలుగో వారంలో ఈ టీకా మార్కెట్‌లోకి రానుంది.

చైనా సహా ఇతర దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా తీసుకొచ్చినట్టు భారత్ బయోటెక్ సంస్థ ఇటీవల వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారికే ఈ నాజల్ స్ప్రే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే కొవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ఈ టీకాను బూస్టర్ డోస్‌గా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రైవుటు ఆస్పత్రుల్లో మాత్రమే ఈ టీకా అందుబాటులో ఉంటుంది.

సాధారణంగా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించేంది ముక్కు, నోటి ద్వారానే. అక్కడి నుంచే గొంతులోకి, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాంతో శ్వాస సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న ఇంజెక్షన్ వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ నాసికా టీకా అద్భుతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.బీబీవీ154 గా పిలవబడే ఈ నాజల్ స్ప్రే టీకా కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు ప్రయోగాల్లో వెల్లడైంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Corona | చైనాలోని ఆ ఒక్క నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు.. చేతులెత్తేసిన అధికారులు

PM Modi meeting on corona | కరోనాపై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం.. ముప్పు తొలగిపోలేదు.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచన

Exit mobile version