Home Latest News Kaushal Kishore | మద్యం తాగేవాళ్లకు పిల్లనివ్వొద్దు, మీ బిడ్డల గొంతు కొయ్యొద్దు.. కన్నీటి పర్యంతమైన...

Kaushal Kishore | మద్యం తాగేవాళ్లకు పిల్లనివ్వొద్దు, మీ బిడ్డల గొంతు కొయ్యొద్దు.. కన్నీటి పర్యంతమైన కేంద్ర మంత్రి

Pic credit: Kaushal kishor facebook

Kaushal Kishore | మద్యం తాగేవాళ్లకంటే రిక్షా కార్మికుడు లేదా రోజూవారీ కూలీకి పిల్లనివ్వడం ఉత్తమమని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం వల్ల తన కుటుంబం ఎంతో నష్టపోయిందని, నాలా మీరూ క్షోభకు గురికావొద్దంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని లంభువా నియోజకవర్గంలో డీ అడిక్షన్‌పై నిర్వహించిన కార్యక్రమానికి కౌశల్‌ కిశోర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం వల్లే తన కుమారుడిని పోగొట్టుకున్నా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

కేంద్ర మంత్రి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమవడంతో అక్కడున్నవారంతా షాక్‌ అయ్యారు. ” నేను ఎంపీగా, నా భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మా కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయాం. చెడు స్నేహం వల్ల మద్యం అలవాటైంది. చివరికి దానికి బానిసయ్యాడు. దీంతో డీ అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించాం. ఆరు నెలల తర్వాత మద్యం మానేశాడని పెళ్లి కూడా చేశాం. కానీ పెళ్లైన కొద్దిరోజులకే తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అతని మరణానికి కారణమైంది. రెండేళ్ల క్రితం ఆకాశ్‌ చనిపోయేనాటికి అతనికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కట్టుకున్న భార్య, బిడ్డ ఇద్దరూ అనాథలయ్యారు. ఇప్పుడు వారితో పాటు నేను క్షోభను అనుభవిస్తున్నాను” అంటూ తన వ్యక్తిగత అనుభవాన్ని కేంద్ర మంత్రి వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో అక్కడున్నవారికి నోటమాటలు రాలేదు. ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా నిశ్శబ్దంగా మారిపోయింది.

కాస్త తేరకున్నాక.. దయచేసి మీ కుమార్తెలు, అక్కాచెల్లెళ్లను మద్యం తాగేవాళ్లకు ఇచ్చి వారి గొంతు కోయొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆడబిడ్డల అందమైన జీవితాన్ని తాగుబోతుల చేతులో పెట్టొద్దని వేడుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మద్యం తాగేవాళ్లు పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చారు. తాగుడు వల్ల ఏటా 20 లక్షల మంది మరణిస్తున్నారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు. దాదాపు 80 శాతం కేన్సర్‌ మరణాలకు పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమన్నారు. డీ అడిక్షన్‌ కార్యక్రమంలో ప్రజలు, సంస్థలు భాగస్వామ్యం కావాలని, కుటుంబాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. డీ అడిక్షన్‌ కార్యక్రమాన్ని పాఠశాలలకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Gali Janardhan Reddy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్.. సొంత పార్టీ పెట్టిన గాలి జనార్ధన్ రెడ్డి

viral news | ఎన్నికల్లో ఓడిన కోపం మామ తోటపై తీర్చుకుంది.. యువకుడిలో గర్భాశయం.. మహిళ కంట్లోంచి 200 రాళ్లు..

RBI Ex Governor Rangarajan | భారత్ అభివృద్ధి చెందిన దేశం కావాలంటే మరో 20 ఏండ్లు ఆగాల్సిందేనా? ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ కామెంట్స్ ఇవే

Indian Army | భారత్‌లో విధ్వంసానికి పాకిస్థాన్ ప్లాన్.. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో కుట్ర భగ్నం

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

Andhra pradesh | 2024లో ఓడిపోతే అమరావతిలోనే ఉంటావా? వైఎస్ జగన్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Exit mobile version