Home Latest News RBI Ex Governor Rangarajan | భారత్ అభివృద్ధి చెందిన దేశం కావాలంటే మరో 20...

RBI Ex Governor Rangarajan | భారత్ అభివృద్ధి చెందిన దేశం కావాలంటే మరో 20 ఏండ్లు ఆగాల్సిందేనా? ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ కామెంట్స్ ఇవే

RBI Ex Governor Rangarajan | భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ మాట చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మరి అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడైతది..? దీనికి ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ సమాధానమిచ్చేశారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందని చెప్పారు.

భారత దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ.. ఇది కేవలం పరిమాణం పరంగానే. తలసరి ఆదాయం పరంగా చూస్తే భారత్ ఐఎంఎప్ ర్యాంకుల్లో 197 దేశాలతో పోలిస్తే 142 స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం కేవలం 3,472 డాలర్లే ఉందన్నారు. తలసరి ఆధాయం 13,205 డాలర్లకు చేరినప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచం గుర్తింస్తుందని రంగరాజన్ చెప్పారు. అలా జరగాలంటే స్వల్ప కాలిక లక్ష్యమైన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాకుండా.. దీర్ఘ కాలిక లక్ష్యాలు పెట్టుకోవాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు. 8, 9 శాతం వృద్ధితో వెళితే మరో 20 ఏండ్లకు తలసరి ఆదాయం 13,205 డాలర్లకు చేరుకుందన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Lock down | భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగితే లాక్‌డౌన్ విధిస్తారా ? ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ ఏమన్నారు ?

Indian Army | భారత్‌లో విధ్వంసానికి పాకిస్థాన్ ప్లాన్.. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో కుట్ర భగ్నం

Dhamaka review | రవితేజ ధమాకా రివ్యూ.. మళ్లీ ట్రాక్‌ ఎక్కాడా?

Exit mobile version