Home Latest News Gali Janardhan Reddy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్.. సొంత...

Gali Janardhan Reddy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్.. సొంత పార్టీ పెట్టిన గాలి జనార్ధన్ రెడ్డి

Pic Credit: Facebook Gali janardhan reddy

Gali Janardhan Reddy | కర్ణాటకలో ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష ( Kalyana Rajya Pragati Paksha ) పేరుతో పార్టీ ప్రారంభిస్తున్నట్లు ఆదివారం సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో 2023 మే లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజవకర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాలి జనార్ధన్ రెడ్డి.. ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు అని ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో మరో ఎపిసోడ్ ప్రారంభమైందన్న ఆయన.. ఇకపై కర్ణాటక ప్రజలకు సేవ చేస్తానంటూ ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి పలుకరిస్తానని మాటిచ్చారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విడగొడుతున్నారని అన్నారు. కర్ణాటకలో ఇకపై అలా కుదరదన్నారు. కర్ణాటక ప్రజలు ఎప్పుడూ ఐక్యంగానే ఉంటారన్న గాలి.. బీజేపీ మంత్రి శ్రీరాములుతో విభేధాలు లేవని స్పష్టం చేశారు. శ్రీరాములు తనకు చిన్ననాటి స్నేహితుడని, ఎప్పటికీ ఆయనతో సంబంధాలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.

గాలి జనార్ధన్ రెడ్డిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. వివాదాలు కూడా చాలానే చుట్టుముట్టాయి. ఈ సమయంలో బీజేపీని వదిలి సొంత పార్టీ పెట్టడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జైలుకు వెళ్లి గాలి జనార్ధన్ రెడ్డి 2015 నుంచి బెయిల్ పైనే ఉన్నారు. చాలా షరతులతో కూడిన బెయిల్‌ను సప్రీంకోర్టు మంజూరు చేసింది. పాస్ పోర్టు అప్పగించాలని ఆదేశించింది. ముఖ్యంగా కడప, అనంతపురం, బళ్లారి వెళ్లరాదంటూ షరతులు విధించింది. అయితే ఉన్నట్టుండి బీజేపీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టడంపై బీజేపీ రియోక్షన్ ఎలా ఉంటుందో అని అందరూ అనుకుంటున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

Andhra pradesh | 2024లో ఓడిపోతే అమరావతిలోనే ఉంటావా? వైఎస్ జగన్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Exit mobile version