Home Latest News Indian Army | భారత్‌లో విధ్వంసానికి పాకిస్థాన్ ప్లాన్.. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో కుట్ర...

Indian Army | భారత్‌లో విధ్వంసానికి పాకిస్థాన్ ప్లాన్.. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో కుట్ర భగ్నం

Indian Army | శ్రీనగర్: భారత్‌లో మరోసారి మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రపన్నిందా ? లష్కరే తోయిబా సహకారంతో దాడులకు ప్లాన్ చేసిందా? వీరికి పాక్ సైన్యం సహకారమందిస్తోందా? అంటే అవుననే అంటున్నారు భారత ఆర్మీ అధికారులు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, భారత సైన్యం జమ్ముకశ్మీర్‌లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడుల్లో జమ్ముకశ్మీర్‌లోని హత్‌లంగా గ్రామ సమీపంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌లోని యూరి సెక్టర్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అక్రమంగా తరలించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధమున్న కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం పోలీలసులకు అందింది. దీంతో పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. 8 ఏకే 74 రైఫిల్స్‌తో పాటు 12 గన్‌లు, పెద్దమొత్తంలో మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏకే 74 రైఫిల్స్ లాంటి ఆయుధాలను ఉగ్రవాదుల చేతికిచ్చి భారత్‌లోకి ప్రవేశించేందుకు పాక్ దళాలు సహకారం అందిస్తున్నాయని భారత్ ఆరోపించింది. తద్వారా కశ్మీర్ లోయలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Lock down | భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగితే లాక్‌డౌన్ విధిస్తారా ? ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ ఏమన్నారు ?

New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు పెట్టకండి

Imran khan ex Wife reham khan | పదేండ్ల చిన్నవాడితో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య మూడో పెళ్లి

Exit mobile version